పవన్ కళ్యాణ్ 30వ సినిమా కోసం త్రివిక్రమ్‌తో పోటీ పడుతున్న శిష్యుడు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా బర్త్ డే విషెస్ అందిన విషయం తెలిసిందే. అగ్ర హీరోల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు చాలా మంది పవర్ స్టార్ కి విషెస్ అందించడంతో నిన్న సోషల్ మీడియా ప్రపంచంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్ పేరే వినిపించింది. ఇక ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఏ రేంజ్ లో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

రానున్న మూడేళ్ళలో..

రానున్న మూడేళ్ళలో..

ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ కూడా అభిమానులకు మంచి కిక్కిచ్చాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒకేరోజు నాలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి. అజ్ఞాతవాసి అనంతరం రాజకీయాల కారణంగా కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ ఇక రానున్న మూడేళ్ళలో ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలను వదలనున్నాడు అని అర్థమైంది.

పదునైన కథలను రాసుకొని

పదునైన కథలను రాసుకొని

వకీల్ సాబ్ సినిమా అనంతరం 27, 28, 29 ప్రాజెక్టులకు పవన్ కళ్యాణ్ ఆల్ రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ వంటి అగ్ర దర్శకులు పవన్ కోసం పదునైన కథలను రాసుకొని సిద్ధాంగా ఉన్నారు. ఒక్కసారి షూటింగ్స్ మొదలైతే ఇక ఏ మాత్రం ఆగేది లేదు అనే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.

పవన్ 30వ ప్రాజెక్ట్ కోసం

పవన్ 30వ ప్రాజెక్ట్ కోసం

ఇక త్వరలోనే పవన్ కళ్యాణ్ తన 30వ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు అర్ధమవుతోంది. అయితే ఆ సినిమా కోసం గురు శిష్యులు పోటీ పడుతున్నట్లు టాక్ వస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ ఒక సినిమా చేయాల్సి ఉంధి. సీతారా ఎంటర్టైన్మెంట్స్ కూడా స్పెషల్ బర్త్ డే విషెస్ అందించడంతో ఆ కాంబోలోనే సినిమా ఉంటుందని ఊహాగానాలు వస్తున్నాయి.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
గురువుతో పోటీ పడుతున్న యువ దర్శకుడు

గురువుతో పోటీ పడుతున్న యువ దర్శకుడు

ఇక త్రివిక్రమ్ తో పాటు ఛలో, భీష్మ వంటి కమర్షియల్ హిట్స్ అందుకున్న వెంకీ కుడుములు కూడా పవన్ 30వ సినిమా కోసం పోటీ పడే ఛాన్స్ ఉన్నట్లు టాక్. ఈ దర్శకుడు త్రివిక్రమ్ వద్ద పలు సినిమాలకు సహాయక దర్శకుడిగా పని చేశాడు. అఆ సినిమాకు కూడా వర్క్ చేశాడు. ఈ యువ దర్శకుడు పవన్ తో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ రూమర్స్ పై ఒక క్లారిటీ రావాలి అంటే ముందుగా పవన్ కొన్ని సినిమాలను పూర్తి చేయక తప్పదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X