Nandamuri Balakrishna: దటీజ్ బాలయ్య... వర్షంలోనూ అలా చేస్తూ తెగ కష్టపడుతున్నాడుగా!
బాలయ్య జోష్ ఈ మధ్య మామూలుగా లేదు. ఇప్పటికే ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమా హిట్టుతో జోష్ మీద ఉన్న బాలకృష్ణ.. ఈ ఏడాది రెండో హాఫ్ లో భగవంత్ కేసరిగా రానున్నాడు. ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఈ దసరా పండుగ కానుకగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే....
గీ సారి దసరా జోర్దారుంటది అంటూ నందమూరి బాలకృష్ణ.. భగవంత్ కేసరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ హీరోయిన్ శ్రీలీల.. బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన కాజల్, శ్రీలీల ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఫ్యాన్స్ కు పునకాలు...:ఇప్పటికే బాలకృష్ణ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాలో బాలయ్య ఎన్నడూ లేని విధంగా తెలంగాణ యాసలో మాట్లాడబోతున్నాడు. మునుపెన్నడూ చూడని పాత్రలో బాలయ్యను ఈ సినిమాలో చూడబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం చెప్పుకొచ్చింది. ట్రైలర్ లో బాలయ్య డైలాగ్స్ ఓ రేంజులో ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య డైలాగ్స్ వింటే.. ఫ్యాన్స్ కు పునకాలు పక్కా అంటున్నారు.
దసరా జోర్దార్...:'భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది' అంటూ మేకర్స్ ఇటీవల ఓ పోస్టర్ రిలజ్ చేశారు. ఆ పోస్టర్ పై అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద సాహూ గారపాటి - హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ బాలయ్యకు పోటీగా విలన్ గా నటిస్తున్నారు.

ఫ్యామిలీ సాంగ్...:అయితే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆదివారం కూడా వదలకుండా ఈ సినిమా చిత్రీకరణ షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక గత మూడు రోజులు వర్షాలు పడుతున్నాయి. అయినా... షూటింగ్ కు బ్రేక్ ఇవ్వకుండా బాలయ్య భగవంత్ కేసరి చిత్రీకరణ జరుపుకుంటోంది. నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల, ఇతర నటీనటులతో కలిసి ఫ్యామిలీ సాంగ్ ఉండనుందట.

అదీ బాలయ్య డెడికేషన్...:అయితే హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలోని ఏసీ ఫ్లోర్‌లో ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారని సమాచారం. ఎస్ ఎస్ తమన్ ఈ పాటను కంపోజ్ చేయగా... డ్యాన్స్ మాస్టర్ భాను తన నేపథ్య డ్యాన్స్ స్టెప్పులతో చిత్రీకరిస్తున్నారు. అయితే వర్షంలోనూ బాలయ్య... సినిమా కోసం కష్టపడుతుండటం చూసి ఫ్యాన్స్ అదీ బాలయ్య డెడికేషన్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











