టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మెగాబ్రదర్స్-స్పందించని చిరు...
ఓ ఆంగ్ల పత్రిక మెగా కుటుంబంలో వచ్చిన చీలకని హైలైట్ చేస్తూ వార్త ప్రచురించగా, అవకాశం కోసం చూస్తున్న కొన్ని చిరంజీవి వ్యతిరేక టీవీ ఛానల్స్ దానికి తమవంతు రంగుపులిమాయి. అదేవిధంగా సినమా ఇండస్ట్రీలో మెగా బ్రదర్స్ గా పేరుతెచ్చుకున్న చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య ప్రస్తుతం సఖ్యత లేదంటూ టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. అల్లు అరవింద్ సలహాపై చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్స్ లో కలిపేయడానికి నిర్ణయం తీసుకోవడం నాగబాబు, పవన్ కల్యాణ్ లకు ఎంత మాత్రం ఇష్టం లేదనీ, అందుకే వారిద్దరూ ఈమధ్య చిరంజీవికి దూరంగా ఉంటున్నారనీ అంటున్నారు. ఇటీవల పవన్ కల్యాణ్ చేసిన 'తీన్ మార్' సినిమా విషయంలో కూడా ఈ బ్రదర్స్ ఇద్దరూ అల్లు అరవింద్ ను దూరంగా ఉంచారని చెప్పుకుంటున్నారు. నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి త్వరలో బీజేపీ లో చేరనున్నారని టాలీవుడ్ అంతా కోడై కూస్తోంది.
అయితే, అన్నకు ఎంతో గౌరవం, విలువ ఇచ్చే ఈ సోదరులు అన్న వ్యవహార శైలి ఎంత నచ్చకపోయినా, మరో పార్టీలో అదీ కాంగ్రెస్ కు బద్ధ విరోధి అయిన బీజేపీలో చేరే సాహసం చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా నిలుస్తోంది. అయితే, తమ సోదరుల మధ్య ఎటువంటి వివాదం లేదని తాజాగా నాగబాబు చెప్పడం గమనార్హం. తాము సినిమాల్లో బిజీగా వుంటే, అన్నయ్య రాజకీయాల్లో బిజీగా వున్నారని నాగబాబు చెప్పారు. ఏమైనా, ఇప్పుడు మెగా బ్రదర్స్ టాలీవుడ్ లో అందరికీ హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పటికైనా చిరు కాని, పవన్ కానీ నోరు విప్పి వీటికి బ్రేక్ వేయకపోతే రేపు తమ మధ్య నిజంగా ఏమీ లేదని చెప్పినా కానీ జనం నమ్మలేనంతగా పరిస్థితి చేయి దాటిపోతుంది.


Click it and Unblock the Notifications











