RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కథనాయకులుగా నటిస్తున్న బిగ్ బడ్జెట్ సినిమా RRR. ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైవు నందమూరి అభిమానులు మరోవైపు మెగా అభిమానులు ఈ బిగ్ మల్టీస్టారర్ కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చినప్పటికీ సమస్య తీరలేదు. ఈ రిలీజ్ డేట్ మళ్ళీ మారే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

Recommended Video

RRR : Ram Charan, Jr NTR's Film To Release On This Date | Oneindia Telugu
హిట్ అవ్వాలంటే..

హిట్ అవ్వాలంటే..

ఒక మంచి సినిమా హిట్ అవ్వాలంటే ఎప్పుడు రిలీజ్ చేసిన హిట్ అవుతుంది. అయితే కలెక్షన్స్ పరంగా భారీ లాభాలు అందుకోవాలి అంటే రిలీజ్ డేట్ చాలా ముఖ్యమయ్యింది. అందుకే పెద్ద సినిమాలు అలస్యమయినా కూడా కరెక్ట్ టైమ్ కోసం ఎదురుచూస్తుంటాయి. పైగా పోటీ కూడా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా..

ఇప్పటికే రెండు సార్లు వాయిదా..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మొదట ఈ సినిమాను 2020 జూలై 31న రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయం సరిపోదని 2021జనవరి 8న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

రిలీజ్ డేట్.. అసలైన వాళ్ళకే నచ్చలేదు

రిలీజ్ డేట్.. అసలైన వాళ్ళకే నచ్చలేదు

మొత్తానికి జనవరిలో రావాల్సిన సినిమా కరోనా కారణంగా వాయిదా వేయక తప్పలేదు. అయితే చాలా రోజులుగా రిలీజ్ డేట్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. ఇక అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతా బాగానే ఉంది కాని సినిమా రిలీజ్ డేట్ అసలైన వాళ్ళకే నచ్చలేదు.

సంతృప్తి చెందని డిస్ట్రిబ్యూటర్స్

సంతృప్తి చెందని డిస్ట్రిబ్యూటర్స్

సినిమా బిజినెస్ లో కీలకమైన డిస్ట్రిబ్యూటర్స్ RRR రిలీజ్ డేట్ పై సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఎందుకంటే దసరా టైమ్ లో కలెక్షన్స్ బాగానే వస్తాయి. కానీ 450కోట్ల పెట్టుబడులు పెట్టిన సినిమాకు ఆ సీజన్ అంతగా వర్కౌట్ కాదని అనుకుంటున్నారట. సంక్రాంతికి వస్తేనే బెటర్ అని అనుకుంటున్నారు.

నిర్మాతను కలవబోతున్నారట..

నిర్మాతను కలవబోతున్నారట..

సంక్రాంతి సీజన్ లో జస్ట్ యవరేజ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా ఈజీగా ప్రాఫిట్ జోన్ లోకి వస్తాయి. ఇక RRR లాంటి బిగ్ బడ్జెట్ సినిమా పొంగల్ హాలిడేస్ లోకి వస్తేనే తొందరగా ప్రాఫిట్ జోన్ లోకి వస్తుందని డిస్ట్రిబ్యూటర్స్ బలంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై చర్చించడానికి అందరూ నిర్మాతను కలవనున్నట్లు తెలుస్తోంది. సినిమాను ఎలాగైనా 2022 సంక్రాంతి వాయిదా వేయాలని కోరనున్నారని సమాచారం. మరి దర్శకుడు రాజమౌళి ఆ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X