Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మగధీరపై ఆ రూమర్?
రామ్ చరణ్ తేజ, ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన మగధీర చిత్రానికి బయ్యర్లు కరువంటూ ప్రచారం జరుగుతోంది. దాదాపు ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల బడ్జెట్ తో తయారైన ఈ చిత్రానికి ఆ రేంజిలోనే రేట్లు డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో బెదిరిపోయిన డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు ఇక్కడిచ్చే డబ్బుతో రెండు మూడు పెద్ద సినిమాలు తీసుకోవచ్చునని వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. అయితే సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్న అల్లు అరవింద్ మాత్రం ఏ మాత్రం తొణకక అన్ని ఏరియాలు స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనే నిర్ణయానికి వచ్చారంటున్నారు. అయితే ఈ చిత్రం బడ్జెట్ విపరీతం కావటంతో ఓ రేంజి హిట్ సరిపోదని, భారీ ఎత్తున క్రౌడ్ పుల్లర్ కావాలని రాజమౌళితో ఆయన స్పష్టంగా చెప్పి భాద్యతను పెంచినట్లు తెలుస్తోంది.అయితే బయ్యర్లు కరవు అనేది రూమర్ అని కొద్ది మంది కొట్టిపారేస్తున్నారు.
ఈ చిత్రలో చరణ్ స్టంట్ మేన్ గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పునర్జన్మల చుట్టూ తిరిగే ఈ కథ ప్రకారం చరణ్ ఈ కాలంలో ఫైట్స్ చేస్తూ బ్రతికుతూంటాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ గా వచ్చిన కాజల్ పరిచయమవుతుంది. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే గతంలో దాదాపు 400 సంవత్సరాల క్రిందటే వీరి ప్రేమ మొలకెత్తుతుంది. అప్పుడు శ్రీహరి పాత్ర వల్ల వీరు విడిపోతారు. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరు మధ్య మరో రకమైన శక్తులు అడ్డుపడతాయి. ఈ జన్మలో శ్రీహరి వీరిని కలపటానకి ప్రయత్నిస్తాడు.
అలాగే మగధీర చిత్రం షూటింగ్ వర్కింగ్ డేస్ 220 రోజులని సమాచారం. బడ్జెట్ కూడా దాదాపు ముఫ్ఫై ఎనిమిది కోట్లు దాకా అయిందని అంతటా వినిపిస్తోంది. అలాగే ఈ చిత్రం మూడు భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.మరో ముఖ్య విశేషం ఏమిటంటే 'బంగారు కోడిపెట్ట...' రీమిక్స్ గీతంలో చిరంజీవి, చరణ్ కలిసి నృత్యం చేశారు. 'మగధీర'లో శ్రీహరి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. కథ: వి.విజయేంద్రప్రసాద్, స్త్టెలింగ్: రమా రాజమౌళి, సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, ఛాయాగ్రహణం: సెంథిల్.