దివి గురించి ఊహించని న్యూస్: ఏకంగా మెగా ఫ్యామిలీలో సెటిల్ అయ్యేలా.. అమ్మడి తీరుకు వాళ్లంతా షాక్!
దివి వాద్యా.. కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న పేరిది. దీనికి కారణం బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో ఈ అమ్మడు అదిరిపోయే క్రేజ్‌ను సంపాదించుకోవడమే. నటిగా ఎప్పుడో పరిచయం అయిన ఆమె.. అంతగా గుర్తింపును అందుకోలేకపోయింది. కానీ, బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆమె ఊహించని రీతిలో పాపులర్ అయింది. దీంతో ఎన్నో ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో దివి వాద్యా గురించి ఊహించని న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

మహేశ్ బాబు ఫ్రెండ్‌గా కనిపించి ఫేమస్
ఉత్తరాది హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మెస్మరైజ్ చేస్తోంది పక్కా తెలుగు పిల్ల దివి వాద్యా. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. కెరీర్ ఆరంభంలోనే 'లెట్స్ గో', 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. అవి ఆమెకు అంతగా గుర్తింపును తీసుకురాలేదు. కానీ, మహేశ్ చిత్రం 'మహర్షి' కీలక పాత్రతో దివి బాగా ఫేమస్ అయింది.

బిగ్ బాస్ ఎంట్రీ.. అందంతో పాటు ఆటలో
'మహర్షి' సినిమా తర్వాత దివి క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ కారణంగానే ఆమెకు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ క్రమంలోనే తాజాగా ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ షోలో అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది అభిమానాన్ని దక్కించుకుంది. నిజాయితీగా ఉంటూ, నిర్భయంగా మాట్లాడుతూ ఆకట్టుకుందీ తెలుగు అమ్మాయి.

అనూహ్యంగా బయటకు.. బాస్‌పై ట్రోల్స్
ఏమాత్రం అంచనాలు లేకుండా హౌస్‌లోకి వచ్చిన దివి.. అసాధారణ ఆటతీరుతో అదరగొట్టింది. దీంతో ఆమె టాప్-5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఈ అమ్మడు ముందే ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ ఓటింగ్ సిస్టమ్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు చెలరేగాయి. అంతేకాదు, షో నిర్వహకులపై విపరీతంగా ట్రోల్స్ కూడా వచ్చాయి.

వరుస ఆఫర్లు.. ఫుల్ బిజీ అయిన భామ
బిగ్ బాస్ షో వల్ల దివి రేంజ్ బాగా పెరిగిపోయింది. ఆమె అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. దీంతో బయటకు వచ్చిన వెంటనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఈ అమ్మడు పలు వెబ్ సిరీస్‌లతో పాటు కొన్ని సినిమాలకు సంతకాలు కూడా చేసేసింది. వీటితో పాటు కొన్ని చిన్న చిత్రాల్లోనూ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు విపరీతంగా ప్రచారం జరుగుతోంది.

ఫ్లాటైపోయిన చిరంజీవి.. పవర్ స్టార్ కూడా
బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తన రాబోయే సినిమా (వేదాళం రీమేక్)లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌ను దివికి ఇస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. దగ్గుబాటి రానాతో కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ 'అయ్యప్పనుమ్ కోషియం' సినిమాలోనూ ఛాన్స్ పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఏకంగా మెగా ఫ్యామిలీలో సెటిల్ అయ్యేలా
వరుస ఆఫర్లు అందుకుంటూ సత్తా చాటుతోన్న తెలుగందం దివి వాద్యా గురించి ఓ వార్త బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ఆమె మరో మెగా హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసిందట. ఇది సెకెండ్ హీరోయిన్ రోల్ అని తెలిసింది. అయితే, ఆ హీరో ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. చిరు, పవన్, ఇప్పుడు మరో హీరో ఇలా దివి మెగా ఫ్యామిలీ సినిమాల్లో బిజీ అయ్యేలా ఉంది.


Click it and Unblock the Notifications











