భార్యలకు టాప్ హీరోల విడాకులు.. శేఖర్ కమ్ములకు లింకేమిటంటే?

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు ఇప్పుడు హీరోల విడాకులు శేఖర్ కమ్ముల వల్లే అంటున్నారు నెటిజన్లు. అసలు అదేంటి? అనే వివరాల్లోకి వెళితే

 భార్యలకు విడాకులు

భార్యలకు విడాకులు


డాలర్ డ్రీమ్స్ అనే సినిమాతో డైరెక్టర్ గా మారిన శేఖర్ కమ్ముల ఆనంద్ సినిమాతో డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. చేసిన సినిమాలు పట్టుమని పది కూడా లేవు కానీ చేసిన అన్ని సినిమాలు బాగుంటాయని పేరుంది. నిజానికి శేఖర్ కమ్ముల తన కెరీర్ లో దాదాపు పెళ్లి కాని హీరోలతోనే సినిమాలు చేశారు. పెళ్ళైన హీరోలతో పనిచేసిన ప్రతిసారి సదరు హీరోలు తమ భార్యలకు విడాకులు ఇచ్చేశారు.

ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే.

ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే.

అవును నమ్మడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది నిజమే. ముందుగా ఆయన రాజాతో ఆనంద్, సుమంత్ తో గోదావరి, చాలా మంది కుర్రాళ్లతో కలిసి హ్యాపీ డేస్, రానాతో లీడర్, చాలా మంది కుర్రాళ్లతో కలిసి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, నయనతార లీడ్ రోల్ లో అనామిక, వరుణ్ తేజ్ హీరోగా ఫిదా, నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ అనే సినిమాలు చేశారు. ఇప్పుడు ధనుష్ తో ఒక సినిమా చేస్తున్నారు.
అయితే ఈ అందరిలో కూడా పెళ్ళైన హీరోలు ముగ్గురే ఉన్నారు.

 పెళ్ళైన హీరోలు ముగ్గురే

పెళ్ళైన హీరోలు ముగ్గురే

వారు సుమంత్, నాగచైతన్య, ధనుష్. సుమంత్ హీరోగా 'గోదావరి' చిత్రం చేశారు. గోదావరి మూవీ 2006లో విడుదల కాగా అదే ఏడాది సుమంత్ భార్య కీర్తి రెడ్డితో విడాకులు తీసుకున్నారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2006లో అధికారికంగా విడాకులు తీసుకుని ప్రకటించారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల చేసిన సినిమాల్లో ఒక్క పెళ్ళైన హీరో కూడా నటించలేదు.
దాదాపు 15 ఏళ్ల తర్వాత నాగ చైతన్యతో ఆయన లవ్ స్టోరీ మూవీ చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సమంతతో ఆయనకు మనస్పర్థలు తలెత్తాయి. అనేక ప్రయత్నాలు చేసినా కలవని పరిస్థితుల్లో సినిమాకు ఇబ్బంది లేకుండా విడుదల తర్వాత వారం రోజులకు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

నాగచైతన్య

నాగచైతన్య


అక్కినేని హీరో నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 24 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. లవ్ స్టొరీ వరల్డ్ వైడ్ గా 1000 కి పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా ఊహకందని ఊచకోత కోసి చివరి వరకు అదే ఊపు చూపింది. ఈ సినిమాను శేఖర్ కమ్ముల తెరకెక్కించగా నారాయణ్ దాస్ కె. నారంగ్, పీ.రామ్మోహన్ రావు నిర్మించారు. ఈ సినిమా విడుదలైన వారానికి నాగచైతన్య తన విడాకుల ప్రకటన చేశారు.

ధనుష్

ధనుష్

ధనుష్ చివరిగా ఆత్రాంగి రే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక ఆయన గత ఏడాదే తెలుగు దర్శకుడితో సినిమా అనౌన్స్ చేశారు. ఫీల్ గుడ్ చిత్రాలతో ప్రేక్షకుల మనసులు దోచుకునే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. శేఖరే ఈ ప్రాజెక్టుని స్వయంగా అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఇది తెరకెక్కనుంది. నారాయణదాసు నారంగ్, పి.రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల, ధనుష్ కలిసి నిర్మించనున్నారు. ధనుష్ తెలుగులో నటించనున్న మొదటి సినిమాగా ఇది నిలవనుంది. ఇక ఆయన కూడా ఈ మధ్యనే తన విడాకులు ప్రకటించారు.

సోషల్ మీడియాలోఎలా అయితే రాజమౌళి సినిమా తరువాత హీరోలు ఎవరితో సినిమాలు చేసినా ఫ్లాప్ అయినట్టు ఇది సెంటిమెంట్ కావచ్చు, లేదంటే కాకతాళీయం కావచ్చు. కానీ ముగ్గురికి ఉన్న కామం లింక్ అయితే శేఖర్ కమ్ములనే. ఈ క్రమంలో శేఖర్ కమ్ములపై ట్రోల్ల్స్, మీమ్స్ తో పెద్ద ఎత్తున చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X