విడాకుల సెటిల్మెంట్-రేణుకు పవన్ రూ. 40 కోట్లు?

By Bojja Kumar

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీన్‌మార్ చిత్రంలో నటించిన రష్యన్ భామ డానా మార్క్స్‌తో డేటింగ్ చేస్తున్నాడని ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అయితే అవన్నీ వట్టి పుకార్లే అని తేలి పోయింది. తాజాగా పవన్ కళ్యాణ్‌పై మరో గాసిప్ గుప్పుమంది. గత కొంత కాలంగా విడిగా ఉంటున్న పవన్ కళ్యాణ్ తన రెండో భార్య రేణు దేశాయ్‌తో కూడా విడాకుల నిర్ణయానికి వచ్చారని వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఆమెతో కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడని, ఇందుకోసం ఆమెకు రూ. 40 కోట్లు ఇచ్చేందుకు రెడీ అయ్యారని చర్చించుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ తన మొదటి భార్య నందినితో ఆగస్టు 12, 2008లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రేణు దేశాయ్‌తో డేటింగ్ చేసి ఆమెను తల్లిని చేసాడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత పవన్-రేణు సంబంధంపై విమర్శలు రావడంతో మెగా కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు ఆమెను జనవరి 28, 2009న ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నాడు.

తర్వాత పవన్ కళ్యాణ్‌కి-రేణు దేశాయ్‌కి పొసగక విడిగా ఉంటున్నారని, ప్రస్తుతం రేణు తన పిల్లలతో కలిసి పుణెలో తన తల్లిదండ్రుల వద్ద ఉంటుందని...ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆమెతో బంధాన్ని విడాకుల ద్వారా పూర్తిగా తెంచుకోవడానికి సిద్దం అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇద్దరి కలిపేందుకు మెగా ఫ్యామిలీలోని పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదట.

ఈ నేపథ్యంలో కోర్టకెళ్లి అబాసుపాలు కాకుండా కోర్టు బయటే సెటిల్మెంట్ చేసుకుని సైలెంట్‌గా విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకోవాలని డిసైడ్ అయ్యారని టాక్. రేణు దేశాయ్ జీవన బృతి కోసం ఆమె పూర్తిగా సంపతృప్తి పడేలా రూ. 40కోట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నారని టాక్. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X