»   » స్టైలిష్ స్టార్ 'డీజే'కు ఓవర్ సీస్‌లో సాలిడ్ ఓపెనింగ్స్!: అప్పుడే హాఫ్ మిలియన్ కలెక్షన్స్!..

స్టైలిష్ స్టార్ 'డీజే'కు ఓవర్ సీస్‌లో సాలిడ్ ఓపెనింగ్స్!: అప్పుడే హాఫ్ మిలియన్ కలెక్షన్స్!..

Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా శుక్రవారం విడుదలైన డీజే(దువ్వాడ జగన్నాథం) బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల స్పందన ఎలా ఉన్నప్పటికీ.. కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా దుమ్ము రేపుతోందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఓవర్ సీస్‌లో డీజే సినిమా ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించిందని చెబుతున్నారు. గురువారం రాత్రి ఓవర్ సీస్ ప్రీమియర్ షోలలో ఈ చిత్రం 350000 డాలర్ల గ్రాస్ ని కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు 180000 డాలర్ల వరకు వసూలు చేసి ఉండవచ్చునని అంచనా. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు.


Dj gets a solid opening in over seas

క్రిటిక్స్ నుంచి డీజేకు ఆశించినంత స్థాయి స్పందన లభించకపోవడంతో.. సినిమాపై నెగిటివ్ రివ్యూస్ ప్రభావం ఎంతవరకు పడుతుందనే దానిపై మరో రెండు మూడు రోజులు ఆగితేనే స్పష్టత వచ్చే అవకాశం వచ్చింది. దీనికి తోడు అటు బ్రాహ్మణ సంఘాల వివాదాలు కూడా సినిమాను వెంటాడుతుండటంతో.. వీటి ప్రభావం సినిమాపై ఎంతమేరకు ఉంటుందనేది డీజే బాక్స్ ఆఫీస్ ఫలితాన్ని డిసైడ్ చేయబోతోంది.


English summary
The opening day box-office numbers of Allu Arjun’s Duvvada Jagannadham are pouring in from all quarters. The film is registering thumping collections in India and overseas
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu