twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    DJ Tillu విషయంలో హీరోయిన్ నేహా శెట్టికి మేకర్స్ షాక్.. పూర్తిగా ప్లాన్ చేంజ్?

    |

    ఈ మధ్యకాలంలో యూత్ ఎక్కువగా సింపుల్ గా ఉన్న కథలకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్దగా ఫైట్లు, యాక్షన్ సీక్వెన్స్ లు లాంటివి లేకపోయినా సింపుల్ కథ అయినా సరే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తే ఖచ్చితంగా ఆదరిస్తామని ఇప్పటికే చాలా చిన్న సినిమాలు నిరూపించాయి. అదే బాటలో వచ్చి చిన్న సినిమాగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం డీజే టిల్లు. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. జులాయిగా తిరిగే టిల్లు అనే డీజే ప్లేయర్, రాధిక అనే ఒక సింగర్ ప్రేమలో పడి ఎలాంటి పరిస్థితులలో చిక్కుకున్నాడు.

    చివరికి రాధిక టిల్లుని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేసింది అనే చిన్న పాయింట్ను తీసుకుని ప్రేక్షకులు మెచ్చే విధంగా దర్శకుడు రూపొందించాడు. ఈ సినిమా కథ మొత్తం కూడా సిద్దు జొన్నలగడ్డ రాసుకోగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కిస్తామని అప్పట్లోనే నిర్మాతలు ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఈ సినిమా సీక్వెల్ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు తాజాగా ఫిలింనగర్ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా సీక్వెల్ విషయంలో యూనిట్ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అదేమిటి అంటే ఈ రెండో భాగంలో రాధిక పాత్ర పూర్తిస్థాయిలో ఉండదని ఆమె స్థానంలో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది.

    dj tillu makers changed the second part script

    రాధిక పాత్రను కేవలం అతిధి పాత్రలా కొంత వరకే పరిమితం చేసి డీజే టిల్లు పాత్రను ఎక్కువగా హైలైట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. రాధిక పాత్రను కొంత చూపించి తర్వాత డిజె టిల్లు కొత్త గర్ల్ ఫ్రెండ్ గా కొత్త హీరోయిన్ ని ఎంట్రీ ఇప్పించే ఛాన్స్ ఉందని ఇప్పుడు ఫిలింనగర్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తర్వాత సిద్దు జొన్నలగడ్డకు కూడా మంచి క్రేజ్ ఏర్పడిన నేపథ్యంలో ఆయన కూడా తనను తాను ప్రమోట్ చేసుకోవడం కోసం ఈసారి కొత్త భామను, ఇప్పటివరకు ఏ సినిమాలో నటించని హీరోయిన్ ను తీసుకుంటే ప్రేక్షకులు అందరి దృష్టి తన మీదే ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. దానికి సంబందించిన అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైందని కూడా తెలుస్తోంది.

    English summary
    dj tillu makers changed the second part script
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X