గోపిచంద్ ప్రేమలేఖలు, ఎస్ఎంఎస్ లు అందుకుంటున్న హీరోయిన్...!?
ప్రముఖ హీరో గోపీచంద్ ప్రేమలో పడ్డారని, ఆ ప్రేమను మర్చిపోలేక తను ప్రేమించిన వ్యక్తికి ప్రేమ లేఖలను ఎస్సెమ్మెస్ ల ద్వారా పంపిస్తున్నాడని ఫిలింనగర్ టాక్. ఇంతకీ గోపిచంద్ ప్రేమించిన వ్యక్తి ఎవరో కాదు, కన్నడ భామ పొడుగు సుందరి అనుష్క..! 'లక్ష్యం"లో వీరిద్దరూ హీరో, హీరోయిన్ గా నటించడమే కాకుండా కాస్త ప్రేమ లో కూడా పడినట్టు అప్పటిలో సినీ పరిశ్రమలో చెప్పుకున్నారు.
'గోపిచంద్" బ్యాక్ గ్రౌండ్ చూసి, అనుష్క కూడా గోపిచంద్ ను పెళ్ళి చేసుకోవాలనే తలంపుతో ఉందని ఉదంతాలు కూడా పుట్టాయి. అయితే అనుష్క తన రూటు మార్చుకుందని, గోపిచంద్ ని మర్చిపోయి, కొత్త ప్రేమానుభూతులలో తేలియాడుతుందని ఫిలింగర్ లో మరొక పుకారు. అనుష్క హీరోయిన్ గా తారాస్థాయికి వెళ్లిందని అనుష్క అన్ని భాషల్లో హీరోయిన్ గా నటించేటమే కాకుండా, ఆర్థికంగా అనుష్క ఎంతో బలపడిందని, గోపిచంద్ మాత్రం ఇదివరకు ఉన్న క్రేజ్ ను నిలబెట్టుకోకపోవడంలో విఫలమయ్యాడని, అందుకే గోపీచంద్ కు పట్టించుకోవడం లేదని ఫిలింనగర్ టాక్.
అయితే ఈ మధ్య అనుష్క కూడా కొత్త బాయ్ ఫ్రెండ్ (వేదం ఫేం క్రిష్)తగలడంతో, అతనితో బాగా తిరుగుతుండటంతో అనుష్క త్వరలో అతన్నే పెళ్ళి చేసుకోబోతున్నారని ఫిలిం ఇండస్ట్రీ టాక్. అయినా గోపిచంద్ అనుష్క పై ఉన్న ప్రేమను, పాత స్నేహాన్ని మర్చిపోలేక ఎస్సెమ్మెస్ ల ద్వారా ప్రేమ లేఖలు పంపిస్తూనే ఉన్నాడని సమాచారం.


Click it and Unblock the Notifications











