Badri పవన్ కల్యాణ్ కంటే ముందు.. బద్రి మూవీని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా? రవితేజ కాదు.. మరెవరంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత కారణాల వల్ల వదిలేసిన సినిమాలతో చాలా మంది యాక్టర్లు స్టార్ హీరోలుగా మారిపోయారు. పవన్ చేసి ఉంటే ఆయన ఖాతాలో తిరుగులేని విజయాలు ఉండేవి. కానీ డేట్స్ కుదరకనో.. లేదా కాంబినేషన్ సెట్ కాకపోవడంతో అలా సినిమాలు పవన్ చేయలేకపోయాడు. అయితే బద్రి సినిమా మాత్రం మరో హీరో వదిలేస్తే పవన్ చేశారనే విషయం చాలా కొద్ది మందికే తెలుసు. ఆ హీరో ఎవరనే విషయంలోకి వెళితే..

పవన్ కల్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో బద్రి మూవీ ఒకటి. అయితే ఆ సినిమా కథను ముందుగా పూరీ జగన్నాథ్ మరో హీరోకు చెప్పారట. ఆ హీరోకు కథ నచ్చకపోవడంతో వదిలేసుకొంటే.. ఆయన పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే పవన్ కూడా తొలుత కథను అంత ఈజీగా ఓకే చేయలేదనేది సినీ వర్గాలు వెల్లడించాయి.

Pawan Kalyans Badri

అయితే పూరి జగన్నాథ్ చెప్పిన స్టోరీ నచ్చకపోవడంతో ఓ హీరో బద్రి సినిమాను చేయడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత పవన్‌కు కథ చెబితే.. క్లైమాక్స్ నాకు నచ్చలేదు. మూవీ ఎండింగ్ మార్చుకొని రమ్మనమని చెప్పారట. దాంతో పూరీ వెనక్కి వెళ్లి కొద్ది రోజుల తర్వాత వచ్చి అదే కథ చెప్పారట. దాంతో క్లైమాక్స్ మార్చలేదని అడిగితే.. ముగింపు మార్చడం నాకు ఇష్టం లేదు. కథ ఇలానే ఉంటే చేద్దాం లేకపోతే ఈ సినిమా చేయను అని పూరీ క్లారిటీ ఇచ్చారట.

దాంతో పూరీ జగన్నాథ్ క్లారిటీ, కమిట్‌మెంట్ నచ్చి సినిమా చేద్దామని చెప్పారట. అలా బద్రి సినిమా వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చింది. ఈ సినిమాలోని బద్రి బద్రినాథ్.. నీవు నందా అయితే నేను బద్రినాథ్ అంటూ చెప్పిన డైలాగ్స్.. అలాగే సినిమాలోని పాటలు హిట్ కావడం, మూవీ కూడా బ్లాక్ బస్టర్ కావడం తెలుగు సినిమాలో ఓ సంచలనంగా మారింది.

ఇక బద్రి కథను ముందుగా చెప్పిన హీరో విషయానికి వస్తే.. ఈ స్టోరీని తొలుత హీరో సుమంత్‌కు చెప్పారట. ఆయితే దాంతో ఈ కథ పవన్ కల్యాణ్ వద్దకు చేరింది. ఆ తర్వాత ఆ సినిమా ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో అందరికి తేలిసిందే. అలా పవన్ ఖాతాలో ఈ మూవీ హిట్‌గా చేరింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X