Balakrishna: బాలయ్య భార్యది గోల్డెన్ హ్యాండ్.. ఈ సెంటిమెంట్ గురించి మీకు తెలుసా?
తండ్రి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తండ్రి వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు అన్నమాటే కానీ... తనదైన నటనతో అభిమాన గణాన్ని ఆయన పెద్ద ఎత్తున సంపాదించుకోగలిగాడు. బాలకృష్ణ కుటుంబ సభ్యులు పెద్దగా తెర మీదకు రావడం జరగదు. కానీ ఆయన భార్య వసుంధర గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వసుంధర దేవితో పెళ్లి...: నందమూరి బాలకృష్ణకి 1982లో వసుంధర దేవితో వివాహం అతిరథ మహారాజుల సమక్షంలో జరిగింది. వసుంధర శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ పోర్ట్ అధినేత అయిన దేవరపల్లి సూర్యరావు కుమార్తె. అంటే ఆమె కూడా పెద్దింట్లోనే పుట్టి పెరిగారు. బాలయ్య వివాహం చేసుకున్న తర్వాత ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్విని. అలాగే ఒక కుమారుడు మోక్షజ్ఞ తేజ జన్మించారు.

భర్తకు అండగా...: వందల కోట్ల ఆస్తికి వారసురాలు అయిన వసుంధర పెళ్లి తర్వాత ఇంటి పట్టునే ఉంటూ సినిమాల్లో బిజీ అయిన తన భర్త పాత్ర కూడా తానే పోషిస్తూ కుటుంబ వ్యవహారాలు అన్నింటిని తన భుజాన వేసుకున్నారు. భర్తకు అన్నివేళలా చేదోడు వాదోడుగా నిలుస్తూ ఇద్దరు కుమార్తెలను ఒక కుమారుడిని ఒక్కరి మార్క్ కూడా లేకుండా పెంచి పెద్ద చేశారు. ఇద్దరు కుమార్తెలకు బెస్ట్ సంబంధాలు తీసుకొచ్చి వివాహం కూడా జరిపించారు.

మోక్షజ్ఞ ఎంట్రీ...: కుమారుడైతే సినీ రంగంలో హీరోగా లాంచ్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు బాలయ్య భార్య వసుంధర గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య భార్య వసుంధరది గోల్డెన్ హ్యాండ్ అని అంటున్నారు. అంటే ఆమె చేత్తో ఎవరికైన డబ్బులు ఇస్తే బాగా కలిసి వస్తుందన్న ఓ సెంటిమెంట్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఆమె చేత్తో డబ్బులు...: అందుకే బాలయ్యతో సినిమా చేసే నిర్మాతలు ముందుగా వసుంధర దగ్గరకు వచ్చి ఆమె చేత్తో లక్ష రూపాయలు తీసుకుంటారని అంటున్నారు. కేవలం బాలయ్యతో సినిమా చేసే నిర్మాతలు మాత్రమే కాదు ఆమె చేతి నుండి డబ్బులు తీసుకుంటే కలిసివస్తుందని ఇండస్ట్రీలో చాలా మంది నమ్ముతారట. అందుకే తమ శుభ కార్యాల నేపథ్యంలో వసుంధర దేవి చేతుల మీదనే డబ్బు తీసుకుంటారట. అంతే కాదు బాలయ్య బయటకు వెళ్లే ముందు వసుంధర ఖచ్చితంగా ఎదురు వెళ్తారని అంటున్నారు.

ఇక బాలయ్య విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య.. భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. శ్రీలీల ఆయన కూతురి పాత్రలో నటిస్తుందని ప్రచారం సాగుతుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 17న దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత బాలయ్య .. బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











