వయసులో చిన్నవాడితోొ ప్రభు కూతురు ఐశ్వర్య పెళ్లి.. ఎన్నేళ్లు తేడా అంటే?
నటుడు ప్రభు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసం లేదు. అనేక సినిమాల్లో హీరోలకు తండ్రిగా కనిపించి మెప్పించిన ఈయన.. చాలా మందికి ఫేవరెట్ యాక్టర్. ముఖ్యంగా డార్లింగ్, చంద్రముఖి, తూనీగా తూనీగా, మిస్టర్ ప్రేమికుడు, నేనే వస్తున్నా, రంగా రంగా వైభవంగా వంటి సినిమాల్లో తండ్రి పాత్రలో కనిపించి అందరినీ అలరించిన ఈయనకు ఇద్దరు పిల్లలు. అయితే ఓ కుమారుడు కాగా మరో కూతురు ఉంది. ప్రస్తుతం కూతురు వయసు 34 సంవత్సరాలు. అయితే తాజాగా ఈయన కూతురను ఓ స్టార్ డెరైక్టర్ కు ఇచ్చి రెండో పెళ్లి చేశారు. అయితే కట్న కానుకలు బాగానే ఇచ్చారట. కట్నంగా ఏమిచ్చారు, ఎంత ఇచ్చారు వంటి పూర్తి వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం.
తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో కూడా పలు చిత్రాలు చేసిన యాక్టర్ ప్రభు కుమారుడు కూడా ఓ హీరోనే. అలాగే కూతురు పేరు ఐశ్వర్యా ప్రభు. అయితే ఐశ్వర్యా ప్రభుకు గతంలోనే ఓసారి వివాహం జరిగింది. తమ దగ్గరి బంధువు అయిన కునాల్ అనే వ్యక్తికి ఇచ్చిన 2009లో ఘనంగా పెళ్లి చేశారు. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. భార్యాభర్తల ఇద్దరి మధ్య వచ్చిన గొడవల కారణంగా... ఆమె అతడితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం తల్లిదండ్రుల వద్దే ఉంటూ సొంతంగా బిజినెస్ చేస్తోంది. అయితే తన సోదురుడు విక్రమ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ఇరుకప్పపుట్టు. తన అన్న సినిమా షూటింగ్ సమయంలో ఐశ్వర్య కూడా అప్పుడప్పుడూ అక్కడకు వెళ్లేది.

ఇలా తన అన్న సినిమా డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ తో ఐశ్వర్యకు స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ అయిన అధిక్ రవిచంద్రన్ నటుడుగా కూడా చాలా సినిమాల్లో కనిపించాడు. ప్రస్తుతం ఈయన వయసు కేవలం 32 సంవత్సరాలు మాత్రమే. అయితే ఐశ్వర్యా ప్రభు కంటే రెండేళ్ల చిన్న వాడైన ఇతడు... ఐశ్వర్యను తొలి చూపులోనే ఇష్టపడ్డాడు. ఆమెకు కూడా ఇతడు నచ్చడంతో చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించారు. ఇక పెళ్లికి ఎక్కువ రోజులు ఆగకూడదు అనుకొని విషయాన్ని ఇరుకుంటాలకు చెప్పి ఒప్పించారు. డిసెంబర్ 15వ తేదీన చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ పెళ్లికి చాలా మంది సెలబ్రిటీలు వచ్చారు. హీరో విశాల్, సుహాసిని, రాధిక.. ఇలా చాలా మంది పెద్ద పెద్ద సెలిబ్రిటీలు వచ్చి సందడి చేశారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వీరికి పెళ్లికి సంబంధించిన మరో వార్త తెగ వైరల్ అవుతోంది. నటుడు ప్రభు.. తన కూతరు చాలా గట్టిగానే కట్నం ఇచ్చినట్లు సమాచారం. ముందు పెళ్లి పెటాకులు అవ్వడం, కూతురు సొంతంగా బిజినెస్ చేయడం... ముఖ్యంగా ప్రభుకు కూడా ఆస్తి పాస్తులు ఎక్కువగా ఉండడంతో.... భారీగానే కట్న కానుకలు ఇచ్చారట.

ప్రభు తండ్రి శివాజీ గణేషన్ సంపాదించిన ఆస్తి చాలా ఎక్కువ. అలా తండ్రి నుంచి వచ్చిన ఆస్తిని రెట్టింపు చేశాడు ప్రభఉ. అలాగే కూతురు ఐశ్వర్య కేక్ లు తయారు చేసే కంపెనీ నడుపుతోంది. దాని ద్వారా కూడా బాగనే ఆదాయం వస్తోంది. ఇదంతా దృష్టిలో ఉంచుకుని ప్రభు.. తన కూతురు ఐశ్వర్యా ప్రభుకు చెన్నైలో ఓ విలాసవంతమైన బంగ్లాతో పాటు కోటి రూపాయల నగదును అందేజేశాడట. అలాగే ఓ వంద తులాల వరకు బంగారం కూడా ఇచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











