Animal: యానిమల్ సినిమాను మిస్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా?
సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి సినిమాతో ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇదే సినిమాను.. బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ ను తెరకెక్కించాడు. అది కూడా సెన్సేషనల్ హిట్టుగా మారింది. ఇక ఇప్పుడు మరోసారి రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా ఓ బాలీవుడ్ బ్యూటీని అనుకున్నారట. ఆ హీరోయిన్ ఎవరో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం యానిమల్. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన ట్రైలర్, పాటలకు సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 1న తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో యానిమల్ టీం ఇప్పటికే ప్రచార పర్వం మొదలు పెట్టింది. ఇక ఇప్పటికే బాలకృష్ణతో కలిసి యానిమల్ టీమ్ సందడి చెేసిన సంగతి తెలిసిందే. అయితే ఇక యానిమల్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా నిడివి కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అంతే కాదు... ఈ సినిమా రన్ టైం 3 గంటల 21 నిమిషాలు కావడంతో అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకు వస్తున్నాయి.

యానిమల్ సినిమాలో మొదటి ఛాయిస్ రష్మిక మందన్నా కాదట. వాస్తవానికి మొదట మూవీ మేకర్స్ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన పరిణీతి చోప్రాను సంప్రదించారని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. రష్మిక మందన్నా ప్లేస్ లో మొదట ఆ హీరోయిన్ సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందట. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పరిణీతి స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే దర్శకుడు ఇంతియాజ్ అలీతో చేస్తున్న ప్రాజెక్ట్ కారణంగా పరిణీతి యానిమల్ మూవీని రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. దాంతో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు మేకర్స్. ఇందులో ఆమె రణబీర్ కపూర్ కు భార్యగా, ఇద్దరు పిల్లలకు తల్లిగా కనిపించబోతోంది నేషనల్ క్రష్. ఇక ఈ సినిమాలో బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పవర్ ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో సూపర్ థ్రిల్ అందించేలా యానిమల్ సినిమా ఉండబోతుంది. యానిమల్ చిత్రాన్ని భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, కృషన్ కుమార్, మురద్ ఖేతని నిర్మించారు.


Click it and Unblock the Notifications











