Raja Saab: ప్రభాస్ రాజా సాబ్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఆయన ఫుల్ జోష్ మీద సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడి చిత్రంతో పాటు... మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి ఈ రాజాసాబ్ చిత్ర పోస్టర్ రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది. అయితే ఈ చిత్రాన్ని మొదట టాలీవుడ్ స్టార్ హీరో చేయాల్సి ఉండేనట. అయితే ఆ హీరో రిజెక్ట్ చేయండంతో ఈ కథ ప్రభాస్ వద్దకు వచ్చిందని తెలుస్తోంది. అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్... ఇటీవల సలార్ చిత్రంతో సూపర్ హిట్టును అందుకున్నాడు. ఇక ఆయన నటిస్తున్న చిత్రాల్లో రాజా సాబ్ ఒకటి. ఈ చిత్రం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం గురించి అనేక వార్తలు బయటకు వచ్చాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. సైలెంటుగా ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో ఇన్ సైడ్ టాక్.

Do you know any Tollywood star hero who missed Prabhas Raja Saab Movie News Goes Viral?

ఇక మారుతి ఇటీవల ఈ చిత్ర స్టోరీమీద ఓ సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. ఈ స్టోరీ లైన్ ను ప్రముఖ ఐఎండీబీ సంస్థ బయటపెట్టడంతో.. అరెరె.. స్టోరీ ఇది అని తెలియకా.. వేరే స్టోరీతో షూట్ చేశామే అంటూ కౌంటర్ ఇచ్చారు మారుతి. దీంతో టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ సినిమా గురించి మరో న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అసలు ప్రభాస్ కు ముందు ఈ స్టోరీకి అనుకున్న హీరో వేరు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రాజా సాబ్ చిత్రానికి మొదట మారుతి.. హీరోగా టాలీవుడ్ స్టార్ హీరో నానిని అనుకున్నారట. ప్రస్తుతం జరగుతున్న ప్రచారం మేరకు మారుతి మొదట ఈ స్టోరీని పూర్తి చేసుకున్నాక కథను హీరో నానికి వినిపించారట. అయితే ఆయన ఈ కథ విని సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే కథను మారుతి వేరే హీరోలకు కూడా వినిపించినట్లు సమాచారం. అయితే ఎవరు ఈ మూవీపై ఆసక్తి చూపించలేదని టాక్.

Do you know any Tollywood star hero who missed Prabhas Raja Saab Movie News Goes Viral?

ఇక అదే కథను పలు మార్పులు చేర్పులు చేసిన మారుతి... చివరకు ప్రభాస్ దగ్గరకు తీసుకుపోయినట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కు మారుతి స్టోరీ చెప్పడంతో... వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అలా రాజా సాబ్ ప్రభాస్ తో పట్టాలెక్కిందని తెలుస్తోంది. మొత్తానికి నాని రిజెక్ట్ చేసిన కథను... ప్రభాస్ తో తెరపైకి తెస్తున్నాడు మారుతి అంటూ రూమర్స్ వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ న్యూస్ మాత్రం టాలీవుడ్ వర్గాల్లో హల్ చల్ చేస్తుంది.

ఇక ఈ స్టోరీని ప్రభాస్ కు తగ్గట్లు మార్పులు చేర్పులు చేయడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఈ సినిమాను హార్రర్ కామెడీ మూవీగా మారుతి తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తమిళ బ్యూటీ మాళవిక మోహనన్ నటిస్తుండగా, మరో ముగ్గురు హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో నటించనున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X