చైతన్యతో నిహారిక కొణిదెలకు విడాకులు.. మెగా డాటర్‌కు భరణం ఎంతో తెలుసా?
ప్రస్తుతం మెగా డాటర్ నిహారిక విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జోన్నలగడ్డ చైతన్య, నిహారిక విడాకులు తీసుకున్నట్లు నిన్న అధికారికంగా ప్రకటించారు. అయితే వీరికి నెల కిందటే విడాకులు మంజూరు కాగా.. ఇప్పుడు ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఇక నిహారిక.. చైతన్య నుంచి భారీ మొత్తంలో భరణం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివవాళ్లోకి వెళితే...
నెలకిందటే విడాకులు: మెగా డాటర్ నిహారిక కొణిదెల, చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకుంటున్నట్లు గతకొంత కాలంగా ప్రచారం సాగుతూనే ఉంది. అనుకున్నట్లు వీరు విడాకులు తీసుకున్నట్లు నిన్న అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. అయితే జూన్ 5నే వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది.

నోరు విప్పిన నిహారిక: ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక విడాకుల వ్యవహారమే వైరల్ గా మారుతోంది. ఎక్కడ చూసినా వీరి వార్తలే కనిపిస్తున్నాయి. దీనిపై మొదటి సారిగా నిహారిక సైతం నోరు విప్పింది. చైతన్య నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కనుక అందరూ సంయమనంతో ఉండాలని కోరుకుంటున్నాను..
ఈ నిర్ణయంపై నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. మేమిద్దరం మరో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు మాకు కాస్త ప్రైవసీ కావాలి. అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.. అంటూ ఇన్ స్టాగ్రామ్ లో ఓ నోట్ రాసింది.

చైతన్య రియాక్షన్: అటు చైతన్య కూడా దీనిపై స్పందించాడు. నిహారిక తాను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని.. వేరు వేరుగా కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పాడు ఈ విషయంలో తమకు మద్దతు ఇచ్చిన కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలని తెలిపాడు.
ఈ విషయంపై కాస్త ప్రైవసీ కావాలని కోరుతూ మరో నోట్ విడుదల చేశాడు. ఇదిలా ఉంటే వీళ్ల కొన్నాళ్ల క్రితమే వీరిద్దరు ఇన్ స్టాలో ఒకరినొకరిని అన్ ఫోలో చేసుకున్నారు. అంతే కాకుండా పెళ్లి ఫోటోస్ డెలీట్ చేసుకోవడంతో వీరిద్దరు విడిపోతున్నట్లు ప్రచారం జరిగింది.

భారీ మొత్తంలో భరణం: అయితే వీరికి హైదరాబాద్ కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు విడాకులకు అనుమతి ఇచ్చింది. కానీ విడాకుల తర్వాత, భార్య భరణం కింద భర్త నుంచి డబ్బు డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు విడాకుల తర్వాత భర్త నుంచి మెయింటెనెన్స్ తీసుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు.
అలాగే నిహారిక కూడా భారీ మొత్తంలో డిమాండ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే తన భర్త నుంచి తనకు ఒక్క రూపాయి కూడా భరణంగా అక్కర్లేదని నిహారిక తెలిపిందట. తన కాళ్లమీద తాను నిలబడతాను.. వాళ్ల దయ తనకు అవసరం లేదని తేల్చి చెప్పిందని కూడా వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











