Pushpa 2: పుష్ప2 ఇంటర్వెల్ బ్యాంగ్.. నిమిషానికి 2 కోట్లు.. మొత్తం ఖర్చు ఎంతంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మికా మందన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం పుప్ప 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నమోదు కాగా... డైరెక్టర్ సుకుమార్ కూడా అందరి అంచనాలకు తగ్గట్లుగానే సినిమాను తీసుకురాబోతున్నారు. అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ కోసం ఆయన నిమిషానికి రెండు కోట్లు ఖర్చు చేశారట. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పుష్ప.. పుష్ప రాజ్.. తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసును బద్ధలు చేసింది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కింకించిన ఈ సినిమా.. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే పుష్ప-2 షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది. పుష్ప-2 సినిమాలోని ఇంటర్వెల్ సీన్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని ఇంటర్వెల్ సీన్ లో భారీ యాక్షన్ సీన్ ను పెట్టబోతున్నారట. గత కొంతకాలంగా ఇదే వార్త వస్తుండగా.. ఎమోషనల్ సీన్ కూడా ఉంటుందని టాక్ నడుస్తోంది. కానీ దీనిపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఇంటర్వెల్ సీన్ కు ముందుగా భారీ యాక్షన్ సీన్ ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా ఈ సీన్ కోసం సుకుమార్ చాలా డబ్బులు ఖర్చు చేయించారట.
నిమిషానికి రెండు కోట్ల రూపాయల చొప్పున డబ్బులు ఖర్చు చేయించినట్లు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా 25 నిమిషాల పాటు సాగే ఈ ఒక్క సీన్ కోసమే మొత్తం 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. సినిమాకి ఇంటర్వెల్ పోర్షన్ కీలకం కావడంతో సుకుమార్ ఈ ఎపిసోడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారట. సీన్ ను బాగా తీసేందుకు ఎంత ఖర్చు అవుతున్నా పట్టించుకోవట్లేదు. ఎక్కడా వెనక్కి తగ్గకుండా మొత్తం 50 కోట్లు ఖర్చు చేసి అద్బుతంగా ఈ సీన్ ను తెరకెక్కించారట.

పుష్ప2 సినిమాలోని జాతర యాక్షన్ సీన్ కోసం ఇంతగా ఖర్చు చేస్తుండడంతో అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే తెగ ఖుషీ అయిపోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా నటిస్తున్నాడు. సునీల్, అనసూయ కీలక పాత్రలు చేయనున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతుంది. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ కాబోతుందో.


Click it and Unblock the Notifications











