Varun Tej Weds Lavanya Tripathi రాయల్‌గా వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి.. ఇటలీలో పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు పూర్తయాయి. ఇప్పటికే ఈ వివాహం కోసం చిరంజీవి, పవన్ కల్యాణ్, రాంచరణ్, అల్లు అర్జున్ ఫ్యామిలీ సభ్యులతోపాటు కామినేని, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొన్న విషయం తెలిసిందే. అయితే అత్యంత విలాసవంతంగా రాయల్ స్టయిల్‌లో జరుగుతున్న పెళ్లికి సంబంధించిన ఖర్చు విషయానికి వెళితే..
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి ముందు భారీ కాక్‌టెయిల్ పార్టీ జరిగింది. అక్టోబర్ 30వ తేదీన జరిగిన ఈ పార్టీకి అల్లు అర్జున్, రాంచరణ్, చిరంజీవి, పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హాజరవ్వడమే కాకుండా ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అల్లు అర్జున్ తన భార్యతో, రాంచరణ్ ఉపాసనతో కలిసి ఈ పార్టీలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ పార్టీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇక అక్టోబర్ 31వ తేదీ మంగళవారం పెళ్లికి సంబంధించిన హల్తీ, మెహందీ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సంప్రదాయ పద్దతిలను పాటిస్తూ తొలుత పుసుపు పూత కార్యక్రమం, ఆ తర్వాత కుటుంబ సభ్యులతోపాటు వధూవరులకు గోరింటాకు పెట్టే కార్యక్రమం జరుగుతుంది అని ఇరు కుటుంబాలు తెలిపాయి.

ఇక నవంబర్ 1వ తేదీన అర్ధరాత్రి వైభవంగా వివాహం జరిపించే ఏర్పాట్లు చేశారు. వేద పండితులు నిర్ణయించిన ముహుర్తాన్ని అనుసరించి.. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున ప్రకారం.. 2.48 గంటలకు వివాహం జరుగుతుంది. ఇప్పటికే గ్రాండ్‌గా పెళ్లి మండపం, రిసెప్షన్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఒక్కటైన తర్వాత భారీగా విందును ఏర్పాటు చేశారు. నవంబర్ 1వ తేదీన రాత్రి 8.30 గంటలకు వివాహ విందు ప్రారంభమవుతుంది. ఈ వివాహానికి మొత్తంగా 120 మంది ఇటలీకి వెళ్లారు. కుటుంబ సభ్యులు కాకుండా మొత్తం 120 మంది అతిథులను ఆహ్వానించినట్టు తెలిసింది.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం కోసం భారీగా ఖర్చు చేశారు. ఇటలీలో ఏర్పాట్లు, ఇతర వసతులు, ఇతర ఖర్చులతో సహా సుమారుగా 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వివాహం తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వచ్చి అభిమానులకు, సినీ ప్రముఖులకు 5వ తేదీన విందును ఏర్పాటు చేయనున్నారు.


Click it and Unblock the Notifications











