కల్కి 2898 AD 1000 కోట్ల హిట్ తర్వాత.. ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఇండియాలోనే నెంబర్ వన్ స్టార్ హీరో ఎవరు అంటే సౌత్ నుంచి నార్త్ దాకా వినిపించే ఒకే ఒక్క యునానిమస్ సమాధానం ప్రభాస్. మరి ఇంతటి డిమాండ్ ఉన్న హీరో రెమ్యూనరేషన్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది కదా. అందుకే ఇప్పటిదాకా ప్రభాస్ తన సినిమాలకు 150 కోట్లు తీసుకుంటూ వచ్చాడు. కానీ తాజాగా మరోసారి రెమ్యూనరేషన్ హైక్ చేసి అందనంత ఎత్తుకి ఎదిగిపోయాడని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వార్త వినిపిస్తోంది. మరి ఇంతకీ ప్రభాస్ ఎంత పారితోషకం పెంచారు? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు చెప్తేనే చాలు థియేటర్లలో పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతున్నారు ఫ్యాన్స్. బాహుబలి తో దేశవ్యాప్తంగా మొదలైన డార్లింగ్ ఫీవర్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రభాస్ సినిమా అంటే కనీసం 500 కోట్లు కొల్లగొట్టడం ఖాయం అనే నమ్మకం వచ్చేసింది. అయితే నిజానికి ఇది చిన్న టార్గెట్.

అందుకే ఇప్పుడు ప్రభాస్ సినిమా అంటే 1000 కోట్ల మూవీ అన్నట్టుగా మారింది పరిస్థితి. బాహుబలి తర్వాత రీసెంట్ గా కల్కి మూవీతో ప్రభాస్ ఖాతాలో రెండు 1000 కోట్ల మూవీలు పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రభాస్ సినిమా అంటే డిజిటల్ రైట్స్ కే దాదాపుగా 400 కోట్లు పలుకుతున్నాయి. ఇక థియేట్రికల్ రైట్స్ గురించి చెప్పనక్కర్లేదు.
మరి ఇంత డిమాండ్ ఉన్న హీరో కేవలం 150 కోట్ల పారితోషికం అందుకోవడం అనేది ఆయన రేంజ్ కి తగ్గ రెమ్యూనరేషన్ కానేకాదు. చివరి సినిమా పేరుతో తమిళ హీరో విజయ్ ఇప్పటికే గోట్ మూవీకి 180 కోట్లు వసూలు చేస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఈ సినిమా ముందు వరకు కేవలం 120 నుంచి 150 కోట్లు పారితోషకంగా అందుకున్న విజయ్ రానున్న రోజుల్లో సినిమాలు చేయనని, కంప్లీట్ గా రాజకీయాలపై దృష్టి సారిస్తానని ప్రకటించి తన రెమ్యూనరేషన్ ను అమాంతంగా పెంచేశాడు.

దీంతో గోట్ సినిమాకు ఆయన తీసుకున్న 180 కోట్ల పారితోషికాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ప్రస్తుతం సౌత్ లో అత్యధిక పారితోషకం అందుకుంటున్న నెంబర్ వన్ హీరో విజయ్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఏ టాప్ హీరోతో పోల్చుకున్నా కూడా ప్రభాస్ బెస్ట్ అండ్ నెంబర్ వన్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరో 50 కోట్లు పెంచి రౌండ్ ఫిగర్ 200 కోట్లు రెమ్యూనరేషన్ గా డిమాండ్ చేస్తున్నట్టు తాజాగా ఓ పుకారు షికారు చేస్తోంది. కల్కి 2898 ఏడి మూవీకి 80 కోట్లు వసూలు చేసిన ప్రభాస్ రాజాసాబ్, స్పిరిట్ సినిమాలకు మాత్రం 150 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారు.
కానీ అంతలోపే కల్కి 2898 ఏడి మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ప్రభాస్ తన పారితోషికాన్ని అమాంతం పెంచేసాడని అంటున్నారు. హను రాఘవపూడి మూవీకి ప్రభాస్ 200 కోట్లు పారితోషికంగా తీసుకోబోతున్నాడని తెలుస్తోంది. ఈ వార్తలు గనక నిజమైతే సౌత్ లోనే భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నెంబర్ వన్ హీరోగా ప్రభాస్ పేరు టాప్ ప్లేస్ లో ఉంటుంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











