NY Times Squareపై సితారా పాప..ఆ యాడ్ రెమ్యునరేషన్‌పై మహేష్ షాకింగ్ కండిషన్..ఎంత తీసుకున్నారో తెలిస్తే?
సూపర్ స్టార్ మహేశ్ బాబు లిటిల్ ప్రిన్సెస్ సితార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ... ఎప్పటికప్పుడూ వీడియోస్, ఫోటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు.. తండ్రికి తగ్గ తనయగా గుర్తింపు తెచ్చుకుంది ఈ లిటిల్ ప్రిన్సెస్.
తాజాగా సితార జ్యూవెలరీ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఇక యాడ్ కోసం సితార ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా... దానికోసం మహేశ్ ఓ కండిషన్ కూడా పెట్టారట. ఆ వివరాల్లోకి వెళితే...

సోషల్ మీడియాలో యాక్టివ్: మహేశ్ బాబు కూతురు లిటిల్ ప్రిన్సెస్ సితారకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సితార పేరుమీద ఓ ఇన్ స్టాగ్రామ్ కూడా ఉంది. అందులో ఆమెకు 1.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఫోటోస్, వీడియోలు అప్లోడ్ చేస్తూ.. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఆ మధ్య మహేశ్ నటించిన సినిమాల పాటలకు సితార చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహేశ్ తగ్గ కూతురిగా: ఇక ఒక్క పాన్ ఇండియా సినిమా తీయకపోయినా మహేశ్ కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. అయితే ఒక్క సినిమాలో కూడా నటించని సితార కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఇటీవల మహేశ్ కూతురు సితార జ్యూవెలరీ యాడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ లో పాల్గొంది. మహేష్ బాబు గారాల పట్టి సితార తాజాగా పీఎంజే జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

రెమ్యూనరేష్ ఎంతంటే: అయితే ఈ యాడ్ కోసం సితార ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా... దీనికోసం కొంత మంది నెటిజన్లు నెట్లో వెతుకుతున్నారట. అయితే ఈ యాడ్ కోసం సితార పాప ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలుస్తోంది. దానికి కారణం మహేశ్ బాబు అని మాట వినిపిస్తోంది. అయితే ఆ జ్యూవెలరీ సంస్థ మాత్రం సితార కోసం ఓ గిఫ్ట్ పంపిందట. ఓ డైమండ్ హారం, రింగ్, బ్రాస్లెట్లను సితార కోసం ఆ సంస్థ పంపిందని సమాచారం. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

కుందనపు బొమ్మలా: అంతేకాదు ఆ బ్రాండ్ జ్యువెలరీ సితార ధరించిన ఫోటోలను, దానికి సంబంధించిన యాడ్ లను న్యూ యార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం విశేషం. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట సైతం వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు మహేష్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఇంత చిన్న వయసులోనే సితార సంపాదించడం మొదలుపెట్టింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి సితార ఆ యాడ్ లో కుందనపు బొమ్మల ఉంది.


Click it and Unblock the Notifications











