INDvsAUS Final: వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌కు మహేశ్ బాబుకు ఉన్న లింక్ తేలిస్తే షాక్... మీరు కూడా అదే అంటారు!

ఇప్పుడు ఏ భారతీయుడిని కదిలించినా... ఒకటే మాట.. ఇండియా వరల్డ్ కప్ కొడుతుందా లేదా.. ప్రస్తుతం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ ఫ్యాన్స్ లోనే కాదు.. సామాన్యుల్లోనూ ఒకటే టెన్షన్ ఇండియా కప్ కొడుతుందా లేదా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే వరల్డ్ కప్ మ్యాచ్ కు మన సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ఓ కనెక్షన్ ఉందనే విషయం మీకు తెలుసా.. ఇప్పుడు ఈ న్యూస్ నెట్టంట వైరల్ గా మారిపోయింది. మహేశ్ కు క్రికెట్ ఫ్యాన్స్ రిక్వెస్టులు పెడుతున్నారు. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండియా వరల్డ్ కప్ కొడుతుందా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. కోట్లాది మంది టీవీలకు అతుక్కుపోయారు. ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికే మన తెలుగు స్టార్స్ విక్టరీ వెంకటేష్, తరుణ్ వెళ్లి అక్కడ సందడి చేస్తున్నారు. అంతే కాదు.. నేచురల్ స్టార్ నాని సైతం స్టేడియంలో సందడి చేస్తున్నాడు.

Do You Know Relation Between Mahesh Babu Ind Vs Aus World Cup Final Match Full Details Here.

హాయ్ నాన్న ప్రమోషన్స్ లో భాగంగా అక్కడి వెళ్లిన నాని.. సల్మాన్ ఖాన్ ను కలిశాడు. ఆయనను కలిసి మాట్లాడాడు. వారి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మరోవైపు అనుష్క శర్మ కూడా స్డేడియంలో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తుంది. ఇక బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ బీర్ కపూర్, దీపికా పదుకునే జంట కూడా అక్కడే సందడి చేస్తున్నారు. కోహ్లీ ఔట్ కావడంతో కాస్త నిరాశ చెందారు. ఇక ప్రస్తుతం మ్యాచ్ గెలుస్తుందనే హోప్ ప్రతి భారతీయుడు పెట్టుకున్నాడు.

ఇదిలా ఉంటే.. మహేశ్ బాబుకు వరల్డ్ కప్ మ్యాచ్ కు ఓ రిలేషన్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు హాజరు అయి సందడి చేశాడు. ఆ ఫోటోలు ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతున్నాయి. అలా మహేశ్ బాబు ఆ మ్యాచ్ కు వెళ్లడంతో.. ఆ మ్యాచ్ గెలిచిందని మహేశ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయన మ్యాచ్ చూసేందుకు వెళ్తే మళ్లీ మ్యాచ్ గెలుస్తుందని వారి భావన.

Do You Know Relation Between Mahesh Babu Ind Vs Aus World Cup Final Match Full Details Here.

ఈ నేపథ్యంలోనే మహేశ్ బాబును క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లమని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆయనకు క్రికెట్ అంటే ఇష్టమే. ప్రస్తుతం ఆయనకున్న బిజీ షెడ్యూల్స్ కారణంగా క్రికెట్ మ్యాచ్ లైవ్ లో చూడడానికి వీలు కాదని తెలుస్తోంది. కొన్ని సందర్భాలలో సినిమా షూట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 2011లో అలాగే వెళ్లిన మహేష్.. అప్పట్లో మ్యాచ్ విన్ అయ్యాము. ఈ సారి కూడా విన్ అవ్వాలంటే మహేశ్ వెళ్లాలని సూచిస్తున్నారు.

ఇక మరికొంత మంది పాత ఎయిర్ పోర్టు ఫోటోలను ట్రెండ్ చేస్తున్నారు. మహేశ్ బాబు అహ్మదాబాద్ బయలుదేరాడు.. మ్యాచ్ గెలుస్తామని తప్పుడు న్యూస్ స్ర్పేడ్ చేస్తున్నారు. కానీ ఆయన మ్యాచ్ కు వెళ్లలేదు. అయితే ఈ సారి మ్యాచ్ గెలుస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే... మహేశ్ సెంటిమెంట్ నిజమవనుంది.. ఒకవేళ గెలిస్తే మాత్రం ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X