ప్రియుడిపై మోజుతో టాప్ హీరోకు విడాకులు.. లవర్ చేతిలో మోసం..ఆ సూపర్‌స్టార్ హీరో భార్య ఎవరో తెలుసా?

సినీ పరిశ్రమలో బ్రేకప్స్, ప్యాచప్స్ చాలా ఎక్కువగానే కనబడతుంటాయి. అయితే బాలీవుడ్‌లో ఇలాంటి వార్తలు, సినీ తారల వివాహేతర సంబంధాలు తరచూ మీడియాలో కనిపిస్తుంటాయి. పచ్చగా సంసారం కొనసాగుతుందని అనుకొనే లోపే విడాకులు తీసుకొని షాకిచ్చిన సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు.

అలాంటి వారిలో హృతిక్ రోషన్, సుసానే ఖాన్ విడాకులు విషయం కూడా షాకింగ్‌గానే ఉంటాయి. అయితే వారి విడాకుల కారణం ఎవరు? అనేది చాలా చర్చనీయాంశమైంది. ప్రియుడి కోసం భర్తకు దూరమైన ఈ ముద్దుగుమ్మ చివరకు అతడిచేతిలోనే మోసపోయారనే విషయం మరింత షాకింగ్‌గా ఉంటుంది. అలాంటి బ్రేకప్ సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 Do You Know Sussanne Khan gets divorce with Hrithik Roshan due to Love affair with Arjun Rampal?

బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు సంజయ్ ఖాన్‌ ముద్దుల కూతురు సుసానే ఖాన్ అమెరికాలో ఇంటీరీయర్ డిజైనర్‌ విద్యను అభ్యసించారు. హిందీ సినిమా పరిశ్రమలో నటుడు, నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్ కుమారుడు హృతిక్ రోషన్‌తో ప్రేమలో పడింది. దాదావు నాలుగేళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2000 సంవత్సరంలో ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారు.

 Do You Know Sussanne Khan gets divorce with Hrithik Roshan due to Love affair with Arjun Rampal?

హృతిక్, సుసానే జీవితం సవ్యంగానే సంతోషంగా సాగింది. అంతా సవ్యంగా సాగుతుందనే అనుకొనే సమయంలో 2013 సంవత్సరంలో అంటే 13 ఏళ్ల దాంపత్య జీవితం అనంతరం పరిష్కరించుకొలేని విభేదాలు రావడంతో సానుకూలంగా విడాకులు తీసుకొన్నారు. వారికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. విడాకుల తర్వాత కూడా హృతిక్, సుసానే ఇద్దరూ స్నేహితులుగానే ఉండిపోయారు.

 Do You Know Sussanne Khan gets divorce with Hrithik Roshan due to Love affair with Arjun Rampal?

అయితే హృతిక్, సుసానే దాంపత్య జీవితంలో విభేదాలు రావడానికి ప్రధాన కారణం నటుడు అర్జున్ రాంపాల్ అని మీడియాలో గుసగుసలు వినిపించాయి. అర్జున్ రాంపాల్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే హృతిక్‌కు దూరమైందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తల నేపథ్యంలో మేమిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఆ వార్తలు అలాగే కొనసాగాయి. ఆ తర్వాత వారిద్దరూ మధ్య రిలేషన్ కూడా బ్రేకప్ అయింది.

అయితే అర్జున్ రాంపాల్ విషయానికి వస్తే.. తన భార్య మెహిర్ జెసియా నుంచి విడాకులు తీసుకొన్నారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 20 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలికి.. గ్యాబ్రెలా డెమెట్రిడెస్‌తో లివింగ్ రిలేషన్ కొనసాగిస్తున్నాడు. ఇక అర్జున రాంపాల్‌ నుంచి విడిపోయిన తర్వాత సుసానే ఖాన్ ప్రస్తుతం అర్సలాన్ గోనితో రిలేషన్‌షిప్‌లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X