Ram Skanda: 'స్కంద' మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎనర్జిటిక్ రామ్ పోతినేని హీరోగా, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం స్కంద. ఇక ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 15వ తేదీన ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. అయితే అసలు విషయం ఏంటంటే... ఈ సినిమాలో మొదటగా హీరోగా రామ్ ను అనుకోలేదట. టాలీవుడ్ స్టార్ హీరోను ఊహించుకుని ఈ స్టోరీ రాశారట బోయపాటి శ్రీను. అలా ఆ హీరో నుంచి రామ్ కు ఈ కథ ఎలా చేరిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న చిత్రం స్కంద. ఇక ఈ మూవీ రామ్ కెరియర్ లోనే పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్ గా చేస్తోంది. ఇక మేజర్ బ్యూటీ సాయి ముంజ్రేకర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ఆమెతో పాటు శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, ప్రిన్స్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందించగా.. శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించారు.

అయితే స్కంద సినిమాలో రామ్ పోతినేని కంటే ముందే మరో హీరోని అనుకున్నాడట బోయపాటి శ్రీను. అంతేకాదు ఆ హీరో గురించి ఆలోచించి ఈ సినిమా కథని సిద్ధం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. కానీ అనుకున్నది మొత్తం రివర్స్ అయినట్టు ఆ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేశారని సమాచారం. ఇక ఆ హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు కోసమే బోయపాటి శ్రీను స్కంద సినిమాని రాసుకున్నారని ఫిలిం వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక స్కంద సినిమా స్టోరీ మొత్తం మహేష్ బాబుకి చెప్పాక ఆయన మొత్తం విని ఈ సినిమాకు నో చెప్పారట. ఈ సినిమా కథ తనకు సెట్ అవ్వదంటూ సున్నితంగా తిరస్కరించారట. ఇందులో ఉండే పాత్రకి తాను సరిగా న్యాయం చేయలేనని... ఊర మాస్ రేంజులో అభిమానులు తనను ఆదరించలేరని బోయపాటికి చెప్పారట. అలా సూపర్ స్టార్ మహేష్ బాబు.. సున్నితంగా ఈ స్కిప్టును తిరస్కరించారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ఇటీవల ఘనంగా జరుపుకుంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకు బాలయ్య బాబు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు. అంతే కాదు ఈ సినిమా ట్రైలర్ ను ఆయన చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ మంచి రెస్పాన్స్ అయితే వస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్.. డిఫరెంట్ గెటప్స్ లో కనిపించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు ఆకట్టుకుంటున్నాయి.

స్కంద మూవీ వినాయకచవతి కానుకగా సెప్టెంబర్ 15న థియేటర్లలో రిలీజ్ కానుండగా.... ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు 45 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. స్కంద ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్, శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. రామ్ కెరియర్ లోనే భారీ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











