ShahRukh Khan జవాన్ మూవీని రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో... ఎందుకో తెలుసా?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో బాలీవుడ్ బాద్షా నటించిన జవాన్ ఒకటి. ఇక ఈ సినిమాకు తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించారు. షారుఖ్ ఖాన్ కు జోడిగా నయనతార నటించింది. అంతే కాదు ఈ సినిమాలో విలన్ గా తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతపతి నటించారు. దీపికా పదుకునే ఓ ప్రాధాన పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా స్టోరీని మొదట అట్లీ తెలుగు హీరోకు వినిపించారట. ఆయన మాత్రం రిజెక్ట్ చేశారట. ఆ వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నయనతార నటిస్తున్న చిత్రం జవాన్. ఇక ఈ సినిమాను దర్శకుడు అట్లీ తనదైన స్టైల్ లో తెరకెక్కిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా... అలాగే దీపికా పదుకొనె, ప్రియమణి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జవాన్ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ జవాన్ పై అంచనాలను రెట్టింపు చేసింది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ అందించిన సంగీతం వెరే లెవెల్ అని చెప్పాలి. ఇక విజయ్ సేతుపలి లుక్స్ తో పాటు.. షారుఖ్ మ్యానరిజం ఆకట్టుకుంటున్నాయి.
ఇక జవాన్ సినిమా రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ గూస్ బంప్స్ ను అయితే తెప్పిస్తుంది. అలాంటి ఈ జవాన్ సినిమా కథను మొదట టాలీవుడ్ స్టార్ హీరోకు వినిపించారట అట్లీ. ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా... సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇక ఆయన ఈ స్టోరీ విన్నాక.. అద్బుతంగా ఉందని చెప్పారట. బాగా నచ్చిందన్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా తాను చేయలేనని చెప్పుకొచ్చారట.

మహేశ్ బాబు ఈ సినిమాకు నో చెప్పాడానికి ప్రధాన కారణం... కాల్ షీట్స్ లేకపోవడం. దాని వల్లే ఆయన ఈ సినిమాను రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా మహేశ్ బాబు చేసి ఉంటే.. ఆయనకు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపుతో పాటు సక్సెస్ కూడా వచ్చేదని అభిమానులు అంటున్నారు. ఈ సినిమా మహేశ్ బాబుకు బాగా సూట్ అయ్యేదని కామెంట్స్ పెడుతున్నారు.

మహేశ్ బాబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు గుంటురు కారం వాయిదా పడుతూ వస్తోంది. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ఇది అయిపోగానే రాజమౌళితో పాన్ వరల్డ్ సినిమా మొదలు పెట్టాలి. ఇవన్నీ ఉండటం వల్లే... మహేశ్ రిజెక్ట్ చేసి ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా మహేశ్ మంచి మూవీని మిస్ చేసుకున్నారని అంటున్నారు. ఇక జవాన్ మూవీ ఈవారం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సహా హిందీ భాషల్లో సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ కానుంది.


Click it and Unblock the Notifications











