Gopichand: టాలీవుడ్‌లో హీరో గోపీచంద్‌కు ఉన్న పెద్ద బ్యాడ్ నేమ్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న గోపీచంద్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యాండ్సమ్ గా కనిపించే ఈయన అన్ని పాత్రల్లో ఇట్టే ఒదిగిపోతూ.. సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అయితే ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాపులతో నిరాశకు గురైనా.. గామి సినిమాతో మాత్రం హిట్ దిశగా దూసుకు వెళ్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి రీమార్కు లేని ఈయనకు.. తెలుగు సినీ రంగంలో ఓ బ్యాడ్ నేమ్ ఉందట. ఇది అందరికీ తెలిసినా ఒక్కరు కూడా బయట పెట్టలేదట. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తొలివలపు సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి అతి తక్కువ కాలంలోనే మంచి హీరోగా గుర్తిపు తెచ్చుకున్నాడు హీరో గోపీచంద్. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో.. ఆ తర్వాత జయం, వర్షం, నిజం చిత్రాల్లో విలన్ గా నటించి మెప్పించి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అనేక చిత్రాల్లో హీరోగా మెప్పించాడు. ముఖ్యంగా యజ్ఞం, ఆంధ్రుడు, సాహసం, లౌక్యం వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పటికీ ఈయన హీరోగా కొనసాగుతూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నాడు.

Do You Know The Big Bad Name of Hero Gopichand in Tollywood

అయితే ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లతో చాలా నిరాశకు లోనయ్యాడు. కానీ వాటన్నిటిని అధిగమించి ఎలాగైనా సరే హిట్టు కొట్టాలనే ఆశతో గామి సినిమా చేశాడు. ఈ సినిమాపై గోపీచంద్ ఎన్నో ఆశలు పెట్టుకోగా.. అవన్నీ నెరవేరుతున్నాయి. ఫాంటసీ యాక్షన్ జోనర్ లో వచ్చిన ఈ చిత్రం హిట్ దిశగా దూసుకు వెళ్తుంది. అయితే తాజాగా ఈ సినిమా డైరెక్టర్ ఎ హర్ష ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. గోపీచంద్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఆయన గురించి ఎవరికీ తెలియని చాలా విషయాలను వెల్లడించారు.

హీరో గోపీచంద్ కాంట్రవర్శీలకు చాలా దూరం. ఆయనపై ఒక్క నెగిటివ్ న్యూస్ కూడా రాలేదు. అందరితో చక్కగా కలిసిపోయే ఈయనకు మాత్రం ఓ బ్యాడ్ హ్యాబిట్ ఉందట. ఆయన దృష్టిలో అది బ్యాడ్ హాబిట్ కాకపోయినా.. ఎదుటి వారు దాని వల్ల కాస్త ఇబ్బంది పడతారట. అయితే ఇది ఇండస్ట్రీలోని అందరికీ తెలిసిందేనట. అదేంటంటే... హీరో గోపీచంద్ ఏ సినిమా కథ విన్న వెంటనే అస్సలే ఓకే చెప్పరట. కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వెంటనే ఓకే చెప్పిన ఒక్క స్టోరీ కూడా లేదట.

Do You Know The Big Bad Name of Hero Gopichand in Tollywood

డైరెక్టర్ తో మాట్లాడుతున్న ఓ ప్రముఖ యాంకర్.. ఈ విషయాన్ని రివీల్ చేశారు. ముఖ్యంగా ఆయనకు ఉన్న ఈ బ్యాడ్ నేమ్ మీ సినిమాతో పోయిందని.. అదెలా సాధ్యం అయిందని డైరెక్టర్ హర్షను అడిగారు. ఈ సినిమా కథ విన్న వింటనే గోపీచంద్.. మీకు ఓకే చెప్పారట.. అంతగా ఆయన్ను ఇంప్రెస్ చేసిన పాయింట్ ఏంటంటూ అడగ్గా.. మంచి ఎమోషన్ తో పాటు ఫాంటసీ ఉండడం వల్ల ఆయనకు నచ్చిందనుకుంటా అంటూ డైరెక్టర్ వివరించారు. ఏదైతే ఏంటి.. గోపీచంద్ తొలిసారి కథ విన్న వెంటనే ఓకే చెప్పిన ఈ సినిమా హిట్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X