ఏంటి సాయిపల్లవి.. బాలయ్యకు నో చెప్పిందా?.. ధైర్యమున్న అమ్మాయే!
నందమూరి నటసింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తన నటనతో పాటు వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఆయన ఒక్క మాట చెబితే తూచా తప్పకుండా పాటించేవాళ్లు చాలా మందే ఉంటారు. ఆయన సినిమాల్లో నటించడానికి ఎంతో మంది నటులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే నేచురల్ స్టార్ సాయిపల్లవి మాత్రం బాలయ్యకు ఓ విషయంలో నో చెప్పిందట. వివరాళ్లోకి వెళితే..
నేచురాలిటితో ప్రేక్షకుల మదిలో: సాయిపల్లవి.. అందం కాదు.. అభినయమే ప్రధానం అనుకుంటుంది. గ్లామర్ రోల్స్ కన్నా గ్రామర్ రోల్స్‌కే ఆమె ఓటు. ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచిస్తూ.. ఒక చిరునవ్వుతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. మేకప్ వేసుకోకుండా చేసే పాత్రలకు ప్రాణం పోసి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.

నెమలి, విల్లులాగా శరీరాన్ని ఒంచుతూ.. డ్యాన్సర్‌గానూ తన సత్తా ఏంటో చూపించింది. అసలు ఆడియెన్స్ నటిగా నన్ను రిసీవ్ చేసుకుంటారా అన్న డౌట్‌తో కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది.
బాలయ్యతో ఛాన్స్ మిస్: సాధారణంగా చిత్రపరిశ్రమలో కొన్ని కొన్ని సార్లు క్రేజీ కాంబినేషన్స్ మిస్ అవుతూ ఉంటాయి. అవి తెరపై కనిపిస్తే చూడటానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ కాంబో కలిసి నటిస్తే ఎలా ఉంటుందా అని తెగ ఇంట్రెస్ట్‌గా ఉంటారు. అయితే టాలీవుడ్ చిత్రసీమలో నటసింహంగా భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్న హీరో నందమూరి బాలకృష్ణ. ఆయనతో సినిమా చేసేందుకు చాలా మంది రెడీగా ఉంటారు. కానీ నేచురల్ బ్యూటీ సాయిపల్లవి మాత్రం నో చెప్పిందట.

ఏ సినిమాకు నో చెప్పిందంటే: బాలయ్యతో నటించేందుకు ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని చాలా మంది హీరోయిన్స్ ఎదురుచూస్తుంటారు. అయితే ఓ సారి సాయి పల్లవికి బాలయ్య సరసన నటించే అవకాశం వచ్చిందట. ఈ ఏడాది బాలయ్య వీరసింహా రెడ్డితో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య చెల్లిగా వరలక్ష్మీ శరత్ కుమార్ తన నటనతో థియేటర్లో ఈలలు వేయించారు. అయితే ఈ పాత్ర మొదట సాయిపల్లవికే వరించిందట.

ఫీల్ అయిన గోపిచంద్: వాస్తవానికి ఈ చిత్ర డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. వరలక్ష్మీ చేసిన పాత్ర కోసం ముందుగా సాయి పల్లవిని అప్రోచ్ అయ్యారట. కానీ కారణం చెప్పకుండానే సాయిపల్లవి సున్నితంగా తిరస్కరించిందట. దీంతో గోపిచంద్ కాస్త ఫీల్ కూడా అయ్యారని కథనాలు వచ్చాయి. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు.. వరలక్ష్మీ బాగా నటించిందని, ఆ పాత్ర సాయిపల్లవికి అస్సలు సూట్ అవ్వదని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం సాయిపల్లవి: కమల్‌హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమాలో నటిస్తోంది. ఇందులో శివకార్తికేయన్ హీరో. రాజ్ కుమార్ పేరిసామి దర్శకుడు. బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'భగవంత్ కేసరి'లో నటిస్తున్నారు. ఇది దసరా కానుకగా రిలీజ్ కానుంది. దీని తర్వాత ఆయన బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేయనున్నారు.


Click it and Unblock the Notifications











