SSMB 29 ఫస్ట్ సినిమా కాదా.. 24 ఏళ్ల క్రితమే రాజమౌళి- మహేష్ కాంబోలో సినిమా వచ్చిందా?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో రాజమౌళి-మహేశ్ బాబు కాంబో ఒకటి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్డేట్​ కూడా రాలేదు. అయినా ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త రోజు సోషల్​మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. తొలిసారి వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుందడంతో సినిమాపై భారీ ఎక్స్​పెక్టేషన్స్​ ఉన్నాయి. అయితే గతంలో జక్కన్న దర్శకత్వంలో మహేశ్ నటించాడని మీకు తెలుసా? అవును ప్రస్తుతం దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. వివరాళ్లోకి వెళితే..

అందరి దృష్టి ఈ సినిమాపైనే: దర్శకధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' వరల్డ్​ వైడ్​గా క్రేజ్ తెచ్చుకున్నారు. ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్​కు కూడా ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారం దక్కింది. మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​, యంగ్ టైగర్​ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియెన్స్​ ఫిదా అయిపోయారు. ఈ మూవీపై హాలీవుడ్ ప్రముఖ నటులు, డైరెక్టర్స్​ కూడా ప్రశంసలు కురిపించారు. దీంతో రాజమౌళి రేంజ్​ హాలీవుడ్ స్థాయికి చేరిపోయింది. దీంతో ఇప్పుడందరి దృష్టి మహేశ్ రాజమౌళి సినిమాపై పడింది.

do you know the mahesh rajamouli combo first movie before ssmb 29

అడ్వెంచర్స్​పై శిక్షణ: ఇక ఈ సినిమాకు సంబంధించి పనులు మొదలైపోయాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్​ శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం అందింది. ఈ ఏడాది చివరిలోనైనా.. లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ మీదకు వెళ్లొచ్చని అంటున్నారు. చిత్రం కోసం.. రాజమౌళి మూడు నెలలపాటు మహేశ్ బాబుకు స్పెషల్​ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. మహేశ్​ను స్టైలిష్​గా ఫిట్​గా చూపించడానికి జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నారట. అలాగే అడ్వెంచర్స్​పై కూడా శిక్షణ ఇవ్వనున్నారని తెలిసింది.

do you know the mahesh rajamouli combo first movie before ssmb 29

మహేశ్​తో గతంలోనే వర్క్: అయితే ఇప్పుడు ఓ వార్త నెట్టింట్లో ట్రెండింగ్​గా మారింది. మహేశ్​ రాజమౌళి కాంబోలో ఇదే తొలిసారి సినిమా రానుంది. కానీ నెట్టింట్లో మాత్రం ఇదీ వరకే రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో మహేశ్ నటించారని అంటున్నారు. అదేంటంటే.. మహేశ్​ బాబు హీరోగా అరంగేట్రం చేసిన 'రాజకుమారుడు'. అదేంటి ఈ సినిమాకు దర్శకుడు రాఘవేంద్రరావు కదా అంటారా? అవును ఆయనే డైరెక్టర్​. అయితే ఇది సినిమాకు జక్కన్న అసిస్టెంట్​ డైరెక్టర్​గా ఉన్నారట.

do you know the mahesh rajamouli combo first movie before ssmb 29

డైరెక్షన్ స్కిల్స్​ నేర్చుకోవడం కోసం: డైరెక్షన్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం దర్శకేంధ్రుడు రాఘవేంద్రరావు దగ్గర అసిస్టెంట్​గా జాయిన్ అయ్యారట రాజమౌళి. అలా ఈ క్రమంలోనే రాజకుమారుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్​గా పని చేశారు జక్కన్న. ఈ విషయాన్ని స్వయంగా రాఘవేంద్రరావు ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు కథనాలు ఉన్నాయి. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న నెటినజ్లు కొంతమంది... రాజమౌళి దర్శకత్వంలో మహేశ్​ ఎప్పుడో నటించేశారు అంటూ తెగ మాట్లాడుకుంటున్నారు.

do you know the mahesh rajamouli combo first movie before ssmb 29

అసలు ఈ సినిమా పూర్తవుతుందా?: ఇకపోతే మహేశ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. 'గుంటూరు కారం' టైటిల్​తో రానున్న ఈ సినిమాకు మొదటి నుంచి కష్టాలే ఎదురౌతున్నాయి. ప్రస్తుతం షూటింగ్​ కాస్త బ్రేక్​లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మహేశ్ ఫారెన్ టూర్ వెళ్లారు. సినిమాలో కాస్ట్​ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నాయట. దీంతో అభిమానులు అసలీ సినిమా పూర్తవుతుందా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X