రామ్ చరణ్ లండన్ ట్రిప్ వెనుక సీక్రెట్ ఇదేనా?.. గేమ్ చేంజర్ తర్వాత చెర్రీ బంపర్ ప్లాన్

By Lekhaka

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లండన్ ట్రిప్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రిలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఇలా విదేశాలకు ట్రిప్ వెళ్ళడానికి అనేక రకాల కారణాలు విన్పిస్తున్నాయి. మేడమ్ టుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహం ఏర్పాట్ల కోసమే చెర్రీ లండన్ వెళ్లాడని టాక్ నడిచింది. కానీ తాజాగా ఆయన లండన్ ట్రిప్ వెనుక మరో కారణం ఉందంటూ కొత్త వార్త బయల్దేరింది. అదేంటో ఓ లుక్కేద్దాం పదండి.

ఈ నెల ప్రారంభంలో మేడమ్ టుస్సాడ్స్‌లోని తన మైనపు విగ్రహానికి సంబంధించిన వివరాలను ఖరారు చేయడానికి చెర్రీ లండన్‌కు వెళ్లినట్లు పుకార్లు వచ్చాయి. ఇంకేముంది తమ అభిమాన హీరోను మైనపుతో అమరత్వంతో చూసే అవకాశం రాబోతోంది అంటూ అభిమానులు తెగ థ్రిల్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే చెర్రీ లండన్ ట్రిప్ వెనకున్న సీక్రెట్ ఇదేనంటూ కొత్త పుకారు పుట్టుకొచ్చింది.

చెర్రీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA)లో శిక్షణ తీసుకోవడానికే లండన్ వెళ్లాడని అంటున్నారు. ఈ కొత్త వాదనలతో రామ్ చరణ్ ట్రిప్ చుట్టూ ఉన్న సందడి ఒక్కసారిగా పెరిగియింది. ఆ రూమర్ల ప్రకారం చెర్రీ ఇంటెన్సివ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ శిక్షణలో భాగంగా లండన్‌ వెళ్ళాడు. ఈ వార్తను విన్నాక ఈ శిక్షణ ఆయన భవిష్యత్ పాత్రలను, ముఖ్యంగా యాక్షన్-ప్యాక్డ్ చిత్రాలలో ఎలా మెరుగుపరుస్తుంది అనే ఆసక్తిని పెంచేసింది.

రామ్ చరణ్ తన ఫైటింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలనే ఆలోచనతో ఇలా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నాడని టాక్ నడుస్తోంది. అయితే అసలు ఆయన ఈ మార్షల్ ఆర్ట్స్ ఏ డైరెక్టర్ కోసం నేర్చుకుంటున్నాడు అనేది అందరి మదిలో ప్రస్తుతం మెదులుతున్న ప్రశ్న. ఇప్పటికే ఆయన చేస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. తరువాత చేయబోయే ప్రాజెక్టు కూడా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందని టాక్ నడుస్తోంది కాబట్టి మార్షల్ ఆర్ట్స్ అవసరం ఉండకపోవచ్చు.

Do you know the Reason behind Ram Charan s London Trip

మరి ఆయన ఏ సినిమా కోసం ఈ పని చేస్తున్నారు అనే పుకారు మొదలైందో తెలియదు. కానీ ఈ వార్త చెర్రీ రాబోయే ప్రాజెక్ట్‌లపై అంచనాలను మాత్రం మరింతగా పెంచింది. అయితే చెర్రీ లండన్ ట్రిప్ వెనుక మరో కథ కూడా ఉంది. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న రామ్ చరణ్ దంపతులు ఇటీవల ముంబైలో అనంత్ అంబానీ, రాధికల వివాహానికి హాజరయ్యారు. ఆ తరువాత లండన్ ట్రిప్ కు వెళ్లారు.

ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ త్వరలో #RC16 అనే సినిమాను చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించే ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఆయన భార్య ఉపాసనతో కలిసి లండన్‌కు వెళ్లాడని కూడా అంటున్నారు. ఏదేమైనా ఇందులో ఒక్క రూమర్ పై కూడా క్లారిటీ లేదు. మరి చెర్రీ లండన్ ట్రిప్ వెనకున్న సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఆయనే స్వయంగా రియాక్ట్ అయ్యేదాకా వెయిట్ అండ్ సీ. కాగా ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జోరందుకున్నాయి.

More from Filmibeat

Read more about: ram charan game changer
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X