Sreeleela-Yash: శ్రీలీల, కేజీయఫ్ యశ్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?

టాలీవుడ్ సెన్సెషన్ యంగ్ బ్యూటీ శ్రీలీల.. ఏ రేంజులో క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక వరుస సినిమాలతో టాలీవుడ్ లో బిజియెస్ట్ హీరోయిన్ గా శ్రీలీల కొనసాగుతోంది. ఇక ఈ బ్యూటీ చేతిలో ఏకంగా 10 నుంచి 12 సినిమాలు ఉన్నాయి. అయితే కేజీయఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన యశ్ కు, శ్రీలీలకు మధ్య ఉన్న బంధం ఏంటో తెలుసా? ఆ వివరాల్లోకి వెళితే...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్: ప్రస్తుతం టాలీవుడ్ ను ఏలేస్తున్న బ్యూటీ ఎవరు అంటే.. మొదట గుర్తొచ్చేది శ్రీలీల. ఇక ఈ బ్యూటీ కర్ణాటకలోని బెంగుళూరులో పుట్టి పెరిగింది. ఇక అక్కడే చదువుకుంది. డాక్టర్ చదివిన శ్రీలీల.. హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కిస్ అనే క‌న్న‌డ మూవీతో కెరియర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. తెలుగులో పెళ్లి సందDతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచేసింది ఈ ముద్దుగుమ్మ‌.

Do you know the relationship between Sreeleela and KG Yash?

వరుస సినిమాలు: ఇక రెండో సినిమా రవితేజ నటించిన ధమాకాలో నటించి.. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమాలో ఆమె నటనకు, డ్యాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు ఆమె చేతిలో వచ్చి పడుతున్నాయి. ఇక టాలీవుడ్లో యువ సెన్సేష‌న్ గా మారింది శ్రీలీల. ప్ర‌స్తుతం తెలుగులో శ్రీ‌లీల మ‌హేష్ బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల‌తో నటిస్తునే.. యంగ్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఇక ఆమె చేతిలో దాదాపు 10 నుంచి 12 సినిమా ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది.

Do you know the relationship between Sreeleela and KG Yash?

బావ మరదళ్లు: ఇదిలా ఉండగా.. కేజీయఫ్ సిరీస్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో యశ్ కు, శ్రీలలకు మధ్య సంబంధం ఏంటో తెలుసా..? శ్రీలీల, యశ్.. బావ మరదళ్లు అనే విషయం ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే నిజానికి వీరిది బంధుత్వం కాదు. యశ్ కుటుంబం, శ్రీలీల కుటుంబం మధ్య సన్నిహిత్యం ఉందట. గ‌తంలో శ్రీ‌లీల స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిందని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Do you know the relationship between Sreeleela and KG Yash?

బెంగుళూరులో సెటిల్: ఇక శ్రీ‌లీల త‌ల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్ గా చేస్తుందట. వైద్య రంగంలో ఆమెకు చాలా మంచి పేరు ఉంది. ఆమె పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావును వివాహం చేసుకుని.. ఆమెరికాలో సెటిల్ అయింది. శ్రీ‌లీల పుట్టిన త‌ర్వాత భ‌ర్త‌తో విభేదాలు రావ‌డంతో.. స్వ‌ర్ణ‌ల‌త విడాకులు ఇచ్చేసింది. ఆపై కూతురుకు తీసుకుని బెంగుళూరుకి వ‌చ్చేసి అక్క‌డ సెటిల్ అయింది.

Do you know the relationship between Sreeleela and KG Yash?

న్యూస్ వైరల్: అయితే యశ్ భార్య రాధిక పండిట్‌కు శ్రీ‌లీల‌ తల్లి స్వ‌ర్ణ‌ల‌త‌నే డెలివరీ చేశారట. యశ్ భార్య రాధికకు ఇద్ద‌రు పిల్లలు. కాగా రెండు సార్లు స్వ‌ర్ణ‌ల‌త‌నే ప్రస‌వం చేసిందని సమాచారం. ఈ క్ర‌మంలోనే య‌శ్ ఫ్యామిలీతో స్వర్ణ‌ల‌త, శ్రీ‌లీల‌కు మంచి స‌న్నిహితం ఏర్ప‌డిందని తెలుస్తోంది. ఆ స‌న్నిహితంతోనే రాధిక‌ను అక్కా అని, య‌శ్ ను బావ అని శ్రీ‌లీల పిలుస్తుంది.ఈ విషయాన్ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో శ్రీలీల చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X