Salaar: సలార్ సినిమా ప్రభాస్‌కు ముందు అనుకున్న హీరో ఎవరో తెలుసా?
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తెలుగు సహా అన్ని భాషల విమర్శకులు ప్రేక్షకులు సైతం సినిమా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ సినిమాకు ముందు ప్రశాంత్ నీల్ అనుకున్న హీరో ప్రభాస్ కాదని తాజాగా ఒక ప్రచారం జరుగుతుంది. ఆయన మరొక హీరోని దృష్టిలో పెట్టుకొని సినిమా రాసుకున్నాడు. కానీ ఆ సినిమా ప్రభాస్ వరకు వచ్చి... ప్రభాస్ సినిమాలో భాగము అయ్యాడని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
కన్నడంలో ఉగ్రం కేజిఎఫ్ 1, అండ్ కేజీఎఫ్ 2 లాంటి సినిమాలు చేసి పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ తర్వాత ఎలాంటి సినిమా చేస్తాడా అనే అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ తరుణంలోనే ఆయన హీరో ఎవరు అనేది ముందే ఫిక్స్ అవ్వకుండా ఒక మంచి కథ రాసుకుందాం అని కూర్చుని కథ రాసుకున్నాడట. ఆ కథ రాసుకుంటున్న సమయంలో ముందుగా తమిళ హీరో సూర్యను దృష్టిలో పెట్టుకుని సినిమా కథ రాసుకున్నాడు.

కానీ కథ చర్చల్లో భాగంగా ఈ సినిమాలో హీరోగా ప్రభాస్ ఐతే బాగుంటుందని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సూచించాడట. ఎందుకంటే సినిమాలో హీరోకి కొన్ని బలమైన శక్తులు ఉన్నట్లుగా కథలో రాసుకున్నారు. అలాంటివి నమ్మాలి అంటే కటౌట్ కూడా ఆ స్థాయిలో ఉండాలని సదరు అసిస్టెంట్ డైరెక్టర్ సూచించాడట. తన అసిస్టెంట్ మాటలతో ఆలోచనలో పడిన ప్రశాంత్ నీల్ నిజంగానే కటౌట్ గట్టిగా ఉన్న హీరో అయితే సినిమా మరింత ముందుకు వెళుతుందని భావించాడట.
ఆ సమయానికి ప్రభాస్ డేట్స్ కూడా దొరికే అవకాశం కనిపించడంతో సినిమా కథ ప్రభాస్ దృష్టికి తీసుకు వెళ్లడం ప్రభాస్ కూడా దానికి ఓకే చెప్పడంతో సినిమా అలా పట్టాలెక్కిందని తాజాగా వెళ్ళడైంది. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా సరే ప్రశాంత్ నీల్ ఏమాత్రం స్పందించకపోవడంతో నిజంగానే సూర్యను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా రాసుకున్నారేమో తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో భాగమయ్యాడేమో అనే వార్తలకు బలం చేకూరితోంది.

అయితే నిజానికి ప్రభాస్ తో పోలిస్తే సూర్య మార్కెట్ సహా ఆయన కటౌట్ కూడా చిన్నదే. ప్రభాస్ ఇప్పుడు చెయ్యి ఎత్తి ఒకరిని కొట్టాడు అంటే అది నమ్మశక్యంగా ఉంటుంది. కానీ అదే ఫైట్ సూర్య చేస్తే కాస్త అతిశయోక్తి అనిపించవచ్చు. సో ఈ సినిమా సూర్య కంటే ప్రభాస్ కి బెస్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇప్పటికే మూడు రోజులు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదటి రెండు రోజుల్లోనే దాదాపుగా 300 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. మరి మొదటి వారంలో ఎన్ని వందల కోట్లు రాబడుతుంది ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందనేది వేసి చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











