Sreeleela కోపం వస్తే.. ఆ పని చేస్తుందట.. వామ్మో ఇలా అయితే కష్టమే బాసూ!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆమె మొదటి సినిమాతోనే.. మంచి ఆఫర్లు అందుకుంటూ.. సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ భామ చేతిలో పది నుంచి పన్నేండు సినిమాలు ఉన్నాయి. ఈమె క్రేజ్ రోజు రోజూకు పెరిగిపోతుంది. ఇక ఈ భామకు కోపం వస్తే ఏం చేస్తుందో తెలుసా... శ్రీలీలకు కోపం వస్తే ఓ విచిత్రమైన పని చేస్తుందట. అదేంటో తెలుసుకుందాం పదండి.
మంచి క్రేజ్: కన్నడ భామ శ్రీలీల... ఇప్పుడు టాలీవుడ్ ను దున్నేస్తుందనే చెప్పాలి. ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 12 సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన పెళ్లి సందడి సినిమాతో ఈ భామ టాలీవుడ్ కు పరిచయం అయింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినా... శ్రీలీలకు మాత్రం మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ అయితే వచ్చింది.

అందరి దృష్టి శ్రీలీలపైనే: ఇక రెండో సినిమా రవితేజ ధమాకాలో నటించి.. కుర్రకారు గుండెల్లో మంట పుట్టించింది ఈ భామ. ఈ సినిమాలో తన అందం, అభినయంతో పాటు.. మాస్ రాజా మహారాజ్ రవితేజ ఎనర్జీకి తగ్గట్లు డ్యాన్సులు చేసి.. ఇరగదీసింది. ఈ సినిమాతో ఈ భామ రేంజ్ మరింత పెరిగిపోయింది. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఏ సినిమా చేయాలాన్న ఇప్పుడు అందరూ శ్రీలీల జపమే చేస్తున్నారు. ఓ కుర్ర హీరో లాంఛ్ అయినా.. సీనియర్ హీరో సినిమా అయినా శ్రీలీల ఉండాల్సిందే.

అందుకు భిన్నం: ఇలా మహేష్ బాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ వంటి హీరోల సినిమాలే కాకుండా... విజయ్ దేవరకొండ, నితిన్, రామ్ పోతినేని, నార్నే నితిన్, మోక్షజ్ఞ వంటి కుర్ర హీరోల సినిమాలను కూడా ఒప్పేసుకుంది ఈ భామ. ఇక మంచి జోష్ మీద ఉన్న శ్రీలీల... తనకు కోపం వస్తే ఓ పని చేస్తుందట. అదేంటో తెలిస్తే... మీరూ షాక్ అవుతారు. ఏ అమ్మాయికైనా కోపం వస్తే.. అవతలి వాళ్లను తిడుతుంది లేదంటే.. సైలెంట్ గా తన పని తాను చేసుకుంటుంది. కానీ ఇందుకు భిన్నం శ్రీలీల.

శ్రీలీలకు కోపం వస్తే: శ్రీలీలకు కోపం వస్తే.. వంటింట్లోకి వెళ్లి ముందు ఏది ఉంటే అది ప్లేట్ నిండా పెట్టుకొని కడుపునిండా తినేసి నిద్రపోతుందట. అలా అయితేనే తన కోపం కూల్ అవుతుందట. దానికి తోడు శ్రీలీల మంచి ఫుడీ అంటా. దీంతో ఫుడ్ ను మాత్రం మిస్ అవ్వకుండా తినేసి పడుకుంటుందట. శ్రీలీల లాగా ప్రతి అమ్మాయి చేస్తే.. అసలు ఇంట్లో గొడవలు రావని నెటిజన్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక శ్రీలీల విషయానికి వస్తే: శ్రీలీల ఇప్పుడుప్రతి దర్శక నిర్మాతలకు బంగారు బాతుల కనిపిస్తోంది. ఏ హీరోయిన్ నో అన్నా కానీ.. శ్రీలీలను ఆ సినిమాలో తీసుకుంటున్నారు. ఇక శ్రీలీల రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందని తెలుస్తోంది. దాదాపు 2 కోట్ల రూపాయలు తీసుకుంటుందని టాక్. మరి రెస్ట్ లేకుండా డై అండ్ నైట్ సినిమాలు చేస్తున్న ఈ హీరోయిన్.. టాప్ హీరోయిన్ అవుద్దో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











