Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో.. ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేసిందో ప్రపంచం అంతటికీ తెలుసు. ఇప్పటికీ ఆ సినిమా కలెక్షన్ల ప్రభావం ఒక రేంజ్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్... శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఆయన తన డ్రీమ్ రోల్ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే....
చిరుత సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ తర్వాత... మగధీర సినిమాతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్ తేజ్. ఇక ఈ మధ్యకాలంలో ఆయన క్రేజ్ గ్లోబల్ వ్యాప్తంగా పెరిగిపోయింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని పిలిపించుకుంటూ ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ వెళుతున్నాడు.

రాజమౌళి దర్శకత్వంలో ఆయన ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటించాడు. అల్లూరి సీతారామరాజు అనే పాత్రలో నటించి కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరూ తన వైపు తిప్పుకునేలా చేశాడు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్ గా... అంజలి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన బుచ్చిబాబు దర్శకత్వంలో తన 16వ సినిమా చేయబోతున్నాడు. ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బుచ్చిబాబు... రామ్ చరణ్ తో కలిసి ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా చేయబోతున్నాడు అనే ప్రచారం చాలా రోజుల నుంచి ఉంది . ఎన్టీఆర్ కాదన్న ఈ కథ... రాంచరణ్ కు తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని అంటున్నారు.

అయితే గతంలో రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా చేసిన కొన్ని మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన జీవితంలో కొన్ని సినిమాలు తనకు చాలా స్పెషల్ అని చెబుతూనే తనకు పౌరాణిక పాత్రలు వేయడం అంటే ఇష్టం అని చెప్పుకువచ్చాడు. వాస్తవానికి ఆయన మగధీర అనే సినిమాలో జానపద హీరోగా కనిపించాడు. అంటే ఒక కల్పిత పాత్రలో ఆయన కనిపించాడు.

కానీ నిజంగా పురాణాల్లో ఉన్న పౌరాణిక పాత్రలు చేయాలంటే తనకు ఇష్టమని ఒక రకంగా అవి తనకు డ్రీమ్ రోల్స్ అని రాంచరణ్ చెప్పుకొచ్చాడు. చూడాలి భవిష్యత్తులో రామ్ చరణ్ కోసం ఎవరైనా ఇలాంటి కథలు రాసుకుని ఆయనను హీరోగా నటింప చేస్తారో లేదో అనేది.


Click it and Unblock the Notifications











