Varun Tej Weds Lavanya వరుణ్ తేజ్ దంపతులకు పవన్ కల్యాణ్ సర్‌ప్రైజ్ గిఫ్టు ఏంటో తెలుసా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి మధ్య సుదీర్ఘకాలంగా సాగిన ప్రేమ వ్యవహారానికి ముగింపు పలుకనున్నారు. ప్రేమ వ్యవహారం నుంచి వైవాహిక జీవితం వైపు అడుగులు వేసేందుకు నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు ఇటలీని వేదిక చేసుకొన్నారు. వారిద్దరి వివాహం నవంబర్ 1వ తేదీన అక్కడి కాలమానం ప్రకారం రాత్రి 2.48 నిమిషాలకు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.18 గంటలకు వివాహం జరుగనున్నది. ఈ వివాహానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ ప్రేమ ఎక్కడ చిగురించిందో అక్కడే దానికి వైవాహిక బంధాన్ని బిగించేందుకు సిద్దమయ్యారు. ఇటలీలోని 8వ శతాబ్దానికి చెందిన అతీ ప్రాచీన గ్రామాన్ని తమ వివాహ బంధానికి సాక్ష్యంగా చేసుకొన్నారు. వీరి వివాహం ఇటలీలోని బోర్గో సాన్ ఫెలీస్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.

 Do You Know What Pawan Kalyans surprise Gift to Varun Tej and Lavanya Tripathi on their Destinated Wedding

డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహానికి దాదాపు 120 మంది అతిథులను ఎంపిక చేశారు. కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతోపాటు లావణ్య కుటుంబ సభ్యులు ఈ వివాహం కోసం రెండు రోజుల ముందే ఇటలీకి చేరుకొన్నారు. అతిథులందరికీ రాయల్‌గా వసతులును ఏర్పాటు చేశారు.

 Do You Know What Pawan Kalyans surprise Gift to Varun Tej and Lavanya Tripathi on their Destinated Wedding

మూడు రోజులుగా సాగుతున్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠికి సంబంధించిన పెళ్లి కార్యక్రమాలకు నవంబర్ 1వ తేదీ రాత్రికి ముగుస్తాయి. 30వ తేదీన కాక్ టెయిల్ పార్టీ, 31వ తేదీన మెహందీ, హల్దీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నవంబర్ 1వ తేదీన రాత్రి వారిద్దరి పెళ్లిని వేద పండితులు ఘనంగా నిర్వహించేందుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు.

 Do You Know What Pawan Kalyans surprise Gift to Varun Tej and Lavanya Tripathi on their Destinated Wedding

అయితే వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి పవన్ కల్యాణ్ దంపతులు రెండు రోజుల ముందే ఇటలీకి చేరుకొన్నారు. తన భార్య లెజెనోవాతో కలిసి వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితుల కారణంగా బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ తన ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించి ఇటలీకి చేరుకొన్నారు.

 Do You Know What Pawan Kalyans surprise Gift to Varun Tej and Lavanya Tripathi on their Destinated Wedding

ఏపీలో రాజకీయ పరిస్థితులు ఓ రకంగా ఉండటంతో పవన్ కల్యాణ్ ఈ వివాహానికి హాజరవుతారా? లేదా అనే అనుమానం తలెత్తింది. అయితే తనకు అత్యంత ఇష్టమైన వరుణ్ తేజ్ వివాహం కోసం ఆయన చాలా కార్యక్రమాలు, షూటింగులు రద్దు చేసుకొని ఇటలీకి ప్రయాణం అయ్యారు. పవన్ రాకతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయారు.

అయితే సినీ, మీడియా వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. వరుణ్ దంపతుల కోసం భారీ గిఫ్టును పవన్ కల్యాణ్ దంపతులు ప్లాన్ చేసినట్టు సమాచారం. అయితే బాబాయ్ మీరు పెళ్లికి వస్తే అదే మాకు పెద్ద గిఫ్టు అని వరుణ్ అన్నట్టు తెలిసింది. అయితే వరుణ్ కోసం వెలకట్టలేని ఓ బహుమతిని ప్లాన్ చేశారని.. అదేంటో త్వరలోనే బయటకు రావడం ఖాయం అంటున్నారు అభిమానులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X