Polimera: పొలిమేర సినిమాలో షేక్ చేసిన ఆ పాత్ర‌ను మిస్ చేసుకున్న నటుడు ఎవరో తెలుసా?

ఇటీవల కమెడియన్స్ కూడా మెయిన్ రోల్ లో సీరియస్ రోల్స్ చేస్తూ భయపెడుతున్నారు. సునీల్ ఇప్పటికే విలన్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఇక బ్రహ్మనందం కూడా ఇటీవల కీడా కోలా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక 2021లో పొలిమేర సినిమాతో సత్యం రాజేష్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగా.. దాని సీక్వెల్ పోలిమేర 2 మాత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే మొదట ఈ సినిమాలో మెయిన్ రోల్ ను వేరే కమెడియన్ కు ఆఫర్ వచ్చిందంట. అయితే ఆ వ్యక్తి రిజెక్ట్ చేయడంతో... సత్యం రాజేష్ కు దక్కింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ సత్యం రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో 2021 సంవత్సరంలో తెరకెక్కిన చిత్రం పొలిమేర. ఇక ఈ సినిమాకు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2021లో డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఓటీటీలోరిలీజ్ అయింది. ఈ మూవీకి ఓటీటీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓటీటీలో ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. ఈ సినిమాను ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌ పై భోగేంద్ర గుప్త నిర్మించారు.

Do you know which actor missed the role of Satyam Rajesh in Polimera?

మా ఊరి పొలిమేర హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జోనర్ లో తెరకెక్కింది. ఈ సినిమాలో బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, చిత్రం శ్రీను త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌్లో నటించారు. ఇక ఈ సినిమాను డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేయగా సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక పొలిమేరకు మంచి రెస్పాన్స్ రావడంతో.. దీనికి సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నారు మేకర్స్. అందులో భాగంగానే మా ఊరి పొలిమేర 2ను రూపొందించారు.

Do you know which actor missed the role of Satyam Rajesh in Polimera?

ఇక మా ఊరి పొలిమేర 2 సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరెక్కిన ఈ సినిమా థియేటర్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుదల అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో బ్లాక్‌ బ‌స్ట‌ర్ దిశ‌గా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మా ఊరి పొలిమేర 2 బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ను రాబడుతోంది. ఇక ఈ సినిమా త‌క్కువ బ‌డ్జెట్ తో నిర్మించగా.. లాభాల దిశగా కొనసాగుతోంది.

పొలిమేర 1 అండ్ 2 సక్సెస్ కావడంతో... పొలిమేర 3 కూడా తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఇక‌పోతే ఈ సినిమాతో స‌త్యం రాజేష్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. స‌త్యం మూవీతో గుర్తింపు తెచ్చుకున్న రాజేష్‌ ఇక ఆ సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఇక ఆయన ఇప్పటి వరకు కమెడియన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక పొలిమేర సినిమా ఆయన కెరియర్ లో మరో లెక్క.

Do you know which actor missed the role of Satyam Rajesh in Polimera?

అయితే ఈ పొలిమేర సినిమాలో మొదట ఛాయిస్ సత్యం రాజేష్ కాదు. మొద‌టి అత‌ను పోషించిన క్యారెక్ట‌ర్ కోసం స్టార్ క‌మెడియ‌న్ ఆలీని సంప్ర‌దించారట మేకర్స్. కాన్సెప్ట్ కొత్త‌గా ఉండ‌టంతో అలీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే వేరే ప్రాజెక్ట్స్ లో బిజీ అవ్వడంతో.. ఆ సినిమా ఛాన్స్ సత్యం రాజేష్ కు వెళ్లిందట. డైరెక్ట‌ర్ అనిల్ విశ్వనాథ్ అలీకి బదులుగా స‌త్యం రాజేష్ ను చూస్ చేసుకుని సక్సెస్ కొట్టాడు. అలా అలీ ఈ సినిమాను మిస్ చేసుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X