కల్కి మూవీలో దీపిక పదుకోన్ రోల్.. మిస్ చేసుకొన్న హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగు సినిమాల స్పాన్ పెరిగినప్పటి నుంచి పాన్ ఇండియా సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడుతోంది. పైగా అందరి చూపులూ టాలీవుడ్ సినిమాలపైనే ఉంటున్నాయి. అలాంటి సినిమాల లిస్టులో తాజాగా రిలీజ్ అయిన కల్కి 2898 ఏడీ మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ మూవీలో దీపికా పాత్ర ప్రత్యేకమన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని ఓ హీరోయిన్ జారవిడుచుకుంది. మరి ఆ హీరోయిన్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.

రెబల్ స్టార్ హీరోగా నటించిన హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్టైనర్ కల్కి 2898 ఏడి మూవీ 370 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో జూన్ 27 తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ దాదాపు రెండు రోజుల్లోనే 296 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీని దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో అశ్విని దత్ నిర్మించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

Do you know which actress missed deepika Padukone s role in Kalki 2898 AD

ఇక ఈ కాస్ట్లీయస్ట్ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. అలాగే బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని ఈ సినిమాలో రాక్సీ అనే పాత్రను పోషించింది. వీళ్ళందరి కంటే ముఖ్యమైన పాత్ర దీపిక పదుకొనే పోషించింది. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. సుమతి అనే పాత్రలో మెరిసిన దీపిక తన కడుపులో కల్కిని మోస్తూ సినిమాను అద్భుతంగా నడిపించింది.

ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంటుంది దీపిక. ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని ఒక హీరోయిన్ చేజార్చుకుందట. ముందుగా సుమతి పాత్ర కోసం దీపికా పదుకొనేని కాకుండా పూజ హెగ్డేని అనుకున్నారట. అయితే అంతకుముందే ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా మూవీ చేసిన పూజ హెగ్డే మరోసారి ఆయనతో జోడి కట్టే అవకాశం వచ్చింది.

Do you know which actress missed deepika Padukone s role in Kalki 2898 AD

అయితే అప్పట్లో రాధేశ్యామ్ మూవీ డిజాస్టర్ కావడానికి కారణం పూజా హెగ్డే అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె సరిగ్గా హావభావాలు పెద్దగా పలికించకపోవడం వల్లే సినిమాకు సగం నెగిటివ్ టాక్ వచ్చిందని అన్నారు. అలాగే ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో యూనిట్ తమ నిర్ణయాని మార్చుకొన్నారనే విషయం ఇండస్ట్రీలో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రభాస్ సరసన కల్కి 2898 ఏడీ వంటి పాన్ వరల్డ్ సినిమాలో పూజాకు బదులు దీపిక పదుకోన్‌ను తీసుకొన్నారు.

ఈ రూమర్లలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ, ఆ వార్తలు నిజమైతే గనక పూజా హెగ్డే తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు ప్రభాస్ అభిమానులు సైతం. మరి కొంతమంది మాత్రం ఆమె సుమతి పాత్రలో నటించి ఉంటే ఈ సినిమాకు ఖచ్చితంగా నెగిటివ్ టాక్ వచ్చి ఉండేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక రీసెంట్ టైమ్స్ లో పూజ హెగ్డే నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ అవడంతో టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు కరువైన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X