Balayya: బాలయ్య సినిమాల్లో వసుంధరకు నచ్చిన మూవీ ఏంటో తెలుసా?

కథ ఎలాంటిదైనా, పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయి అద్భుతంగా నటించే అతి కొద్దిమంది నటుల్లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఒకరు. తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని, ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడిగా రాణిస్తున్నారు. ఇప్పటికీ యంగ్ హీరోస్​కు దీటుగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద పైసా వసూల్​ చేస్తున్నారు. మరి బాలయ్య నటించిన సినిమాల్లో ఆయన భార్యకు ఏ సినిమా అంటే ఎక్కువ ఇష్టమో మీకు తెలుసా? దానికి సమాధానాన్ని స్వయంగా బాలయ్య భార్య వసుంధరనే చెప్పింది. అదేంటో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం...

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తొడగొడితే రికార్డులు, మీసం తిప్పితే రివార్డులు అని బాక్సాఫీస్ కలెక్షన్స్ చెబుతుంటాయి. ఇంకా చెప్పాలంటే ఆయన పేరే అభిమానులకు స్లోగన్‌. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో హిట్ సినిమాలను అందించారాయన. ఇప్పుడు కూడా ఆరు పదుల వయసులోనూ సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర​ హిట్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. రీసెంట్​గా భగవంత్ కేసరితో మరో రూ.100 కోట్ల బ్లాక్ బాస్టర్​ను ఖాతాలో వేసుకున్నారు.

Do you know which movie Vasundhara Devi likes in Nandamuri Balayya movies?

వసుంధర దేవితో పెళ్లి... : బాలయ్య పర్సనల్ విషయానికొస్తే 1982లో ఆయనకు వసుంధర దేవితో పెళ్లి జరిగింది. అతిరథ మహారాజుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. వసుంధర శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్ పోర్ట్ అధినేత దేవరపల్లి సూర్యరావు కుమార్తె వసుంధరనే బాలయ్య చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు బ్రాహ్మణి, తేజస్వినితో పాటు ఒక కుమారుడు మోక్షజ్ఞ తేజ జన్మించారు.

బాలయ్య చేసే ప్రతి పనిలోనూ భార్య వసుంధర ఎప్పుడూ ఆయనకు తోడుగా ఉంటారు. బాలయ్య షూటింగ్​లతో బిజీగా ఉంటే ఇంటి బాధ్యతలను వసుంధర భుజాన వేసుకుని చక్కగా నిర్వర్తిస్తారు. మరి ఆమెకు బాలయ్య నటించిన సినిమాల్లో ఏది అంటే ఇష్టమో మీకు తెలుసా? అయితే దీనికి సమాధానం ఆమెనే గతంలో ఓ సారి చెప్పారు.

Do you know which movie Vasundhara Devi likes in Nandamuri Balayya movies?

ఆమెకు ది మోస్ట్ ఫేవరెట్ మూవీ అంటే మాత్రం సమరసింహారెడ్డి అని గతంలో చెప్పుకొచ్చినట్లు బయట కథనాలు ఉన్నాయి. సాధారణంగా వసుంధర దేవి చూడటానికి చాలా సాఫ్ట్ గా సైలెంట్​గా కనిపిస్తారు. హోమ్లీ ట్రెడిషనల్ పాత్రలను ఇష్టపడే వ్యక్తిగా అనిపిస్తారు.

కానీ వసుంధర దేవి మాత్రం మాస్, ఫ్యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సమరసింహారెడ్డిని బాగా ఇష్టపడతానని చెప్పారు. ఇకపోతే ఇప్పటికీ బాలయ్య నటించిన సినిమాలను ఆమె ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ చూస్తారట. కాగా, బాలయ్య ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఎన్​బీకే 109 సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇది షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం కూడా యాక్షన్ మోడ్ అని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X