Guntur Karaam మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరంటే?
సంక్రాంతి బరిలోకి దిగుతున్న సినిమాల్లో మహేశ్ బాబు గుంటూరు కారం సినిమా ఒకటి. ఈ సినిమా ఈ పండక్కి హీటెక్కించేందుకు రెడీ అయిపోయింది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలో హీరోగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు ముందు మరో హీరోను అనుకున్నారట. అయితే ఆ హీరో పలు కారణాల వల్ల ఈ సినిమాను వదులుకున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం గుంటూరు కారం. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు వచ్చాయి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇక ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ శ్రీలీల, మీనాక్షి చౌదరిలు నటిస్తున్నారు. తాజాగా మీనాక్షి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. మీనాక్షి లుక్ కు మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇక సినిమా ట్రైలర్ ను జనవరి 6న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంటును యూస్ఏలో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనున్నారట. దీనితో కొత్త ట్రెండుకు మహేశ్ బాబు శ్రీకారం చుట్టునున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా జనవరి 12న రిలీజ్ కానుండగా.. మంచి హైప్స్ అయితే నెలకొన్నాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా... ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ బయటకు వచ్చింది. మొదట ఈ సినిమాలో హీరోగా మహేశ్ బాబును అనుకోలేదని తెలుస్తోంది. ఆయన కంటే ముందే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోను అనుకున్నారట త్రివిక్రమ్. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అయితే మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాను ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తీయాలని త్రివిక్రమ్ అనుకున్నారని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానీ ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో.. ఈ స్క్రిప్టు మహేశ్ చెంతకు వచ్చిందట. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ... ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ కాంబోలో ఇప్పటికే అరవింత సమేత వచ్చి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే మరో న్యూస్ ఏంటంటే.. ఈ స్క్రిప్ట్ మొదట పవన్ కోసం రాశారని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా స్క్రిప్ట్ మొదటి నుంచి మహేశ్ బాబుని అనుకునే త్రివిక్రమ్ రాశారు.. అని కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











