Tillu Square: శ్రీలీల సహా అనుపమ క్యారెక్టర్ మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా?

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాగా నటించిన చిత్రం టిల్లు స్క్వేర్. ఈ చిత్రం డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా.. ఈరోజు మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల అయిన మొదటి షో నుంచే ఈ సిినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ ను మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీరే అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి టిల్లు స్క్వేర్ సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి.

2022లో వచ్చిన డీజే టిల్లు చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా ప్రేక్షకులను అలరించారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించారు మేకర్స్. డీజే టిల్లు సినిమాకు టిల్లు స్క్వేర్ సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు నరుడా డోనరుడా డైరెక్టర్ మల్లీక్ దర్శకత్వం వహించగా.. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.

Do you know who are the heroines who missed Anupama Parameswaran s character in Tillu Square movie

మార్చి 29న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సూపర్ హిట్టు టాక్ తో దూసుకుపోతుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ ఈ సినిమాను తెరకెక్కించగా.. ఆ బ్యానర్‌ కు మరో బ్లాక్ బస్టర్‌ వచ్చిచేరినట్లు అయింది. అయితే ఈ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ నెలకొనగా... ఇప్పుడు రిలీజ్ అయ్యాక మంచి టాక్ తో దూసుకుపోతుంది. మంచి ఫన్ అండ్ లాఫింగ్ రైడ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Do you know who are the heroines who missed Anupama Parameswaran s character in Tillu Square movie

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా అనుపమను అనుకోలేదు. మొదట 'టిల్లు స్క్వేర్' కోసం కన్నడ బ్యూటీ శ్రీలీల అనుకున్నారనే విషయం తెలిసిందే. కానీ, ఆ అమ్మాయి షూటింగ్ మొదలుపెట్టక ముందే తప్పుకుంది. ఇందులో రొమాన్స్ సీన్స్ ఎక్కువగా ఉండటం వల్లే తప్పుకుందనే వార్తలు వచ్చాయి. ఇక ఆ తరవాత రింగుల జుట్టు బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ఖరారు అయినట్లు వార్తలు వచ్చాయి.

Do you know who are the heroines who missed Anupama Parameswaran s character in Tillu Square movie

ఏమైందో తెలీదు కానీ.. అనుపమ ఈ ప్రాజెక్ట్ నుంచి మొదట బయటికి వచ్చేసింది. ఆ తర్వాత మరో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్‌ ను అనుకున్నారు మేకర్స్. ఆమెతో ఫొటో టెస్ట్ చేసిన తరవాత పాత్రకు ఆమె సెట్ కాదని మేకర్సే వద్దనుకున్నారట. దీంతో మళ్లీ హీరోయిన్ వేట మొదలు పెట్టగా.. గుంటూరు కారం ఫేం మీనాక్షి చౌదరిని తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె కూడా ఈ పాత్రకు సెట్ కాకపోవడంతో మేకర్స్ కు పెద్ద కష్టమే వచ్చింది అప్పట్లో.

Do you know who are the heroines who missed Anupama Parameswaran s character in Tillu Square movie

మళ్లీ ఏమైందో కానీ.. ఈ ప్రాజెక్టులోకి రిజెక్ట్ చేసిన అనుపమ పరమేశ్వరన్ మళ్లీ వచ్చి చేరింది. ఆమె ఓకే చెప్పడంతో.. లిల్లీగా ఇప్పుడు ప్రేక్షకులను అలరించింది. అలా ఈ సినిమాను శ్రీలీల, మడోన్నా, మీనాక్షి.. రిజెక్ట్ చేయగా.. చివరకు అనుపమ ఓకే చేసి సక్సెస్ కొట్టింది. ఇక ఈ సినిమాలో అనుపమతో పాటు.. నేహాశెట్టి కూడా ఎంట్రీ ఇచ్చింది. మరో హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ కూడా ఇందులో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X