HanuMan Movie: ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం హనుమాన్. ఇక ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది. ఇక ఈ సినిమాలో క్యాస్ట్ చిన్నగా ఉన్నా.. సినిమా మాత్రం భారీ లెవెల్ లో రానుంది. అయితే మొదట ఈ సినిమాకు హీరోగా పలువురు స్టార్స్ ను ప్రశాంత్ వర్మ అనుకున్నారట. అయితే వారు ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వస్తున్న తాజా చిత్రం హనుమాన్. ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలే కాకుండా పలు విదేశీ భాషల్లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి కారణం ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Do you know who are the Tollywood star heroes who rejected Prashanth Varmas Hanuman movie?

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మొదట ఈ సినిమాను స్టార్ హీరోలతో చేయాలని ప్రశాంత్ వర్మ భావించారట. అయితే వారు పలు కారణాలతో రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కు మొదట ప్రశాంత్ వర్మ ఈ కథను వినిపించారట. అయితే అల్లు అర్జున్ బిజీ షెడ్యూల్ వల్ల ఈ సినిమాను మిస్ చేసుకున్నారట. ఇక అల్లు అర్జున్ అప్పడు.. పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ అల్లు అర్జున్ ఈ సినిమా చేసి ఉంటే.. ఇంకా వేరే లెవెల్ ఉండేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను మరో స్టార్ హీరో కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన ఎవరో కాదు... ప్రశాంత్ వర్మకు మొదటి సినిమా అవకాశం ఇచ్చిన నేచరల్ స్టార్ నానికి ఈ కథను వినిపించారట ప్రశాంత్ వర్మ. అయితే నాని బ్యానర్ లోనే సినిమా చేయాలని అనుకున్నారట.

Do you know who are the Tollywood star heroes who rejected Prashanth Varmas Hanuman movie?

బడ్జెట్ ఎక్కువ ఉండటంతో.. ఈ సినిమాను నాని కూడా రిజెక్ట్ చేశారట. ఇక దాంతో ప్రశాంత్ వర్మ తన ఫ్రెండ్ అయిన తేజ సజ్జాని ఈ సినిమాలో హీరోగా తీసుకొని ఆయన చేత ఈ సినిమా తెరకెక్కించాలనుకున్నాడు. ఇక వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు జాంబిరెడ్డి సినిమా వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇక ఇప్పుడు ఆ కాంబోని రిపీట్ చేసి హిట్ కొట్టాలని అనుకున్నారట. తేజ సజ్జాని హీరోగా పెట్టి ప్రశాంత్ వర్మ చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ సినిమాని బెస్ట్ అవుట్ పుట్ తో కంప్లీట్ చేశాడు.

Do you know who are the Tollywood star heroes who rejected Prashanth Varmas Hanuman movie?

అలా ఈ సినిమా నుంచి స్టార్ హీరోలు తప్పుకున్నారు. దీంతో మార్కెట్ లేని కొత్త హీరో తేజ సజ్జాతో తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను పూర్తి చేశాడు. ఇక ఈసినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. మరి ఏ రేంజులో ఆకట్టుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X