Mangalavaaram: మంగళవారం మూవీలో పాయల్ రాజ్ పుత్ పాత్రను మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

ఈ వారం థియేటర్లోకి వచ్చిన సినిమాల్లో మంగళవారం ఒకటి. ఆర్ఎక్స్ 100 తర్వాత అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్ లో తెరెక్కిన చిత్రమిది. ఇక ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు మెగా, అల్లు సపోర్టుతో ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లోకి వచ్చేసింది. మంచి పాజిటివ్ బజ్ తో ఈ సినిమా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ రోల్ ను ప్రముఖ హీరోయిన్ మిస్ చేసుకుంది. ఆమె ఎవరు.. ఎందుకు మిస్ చేసుకుందో ఈ స్టోరీలో చూద్దాం.

అప్పటి వరకు సినిమాలంటే... హ్యాపీ ఎండింగ్.. హీరోయిన్ అంటే పాజిటివ్ రోల్.. ఇలా ఉండేవి. ఎప్పుడైతే ఆర్ఎక్స్ 100 సినిమా వచ్చిందో.. కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఆ సినిమాతో అజయ్ భూపతి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. బోల్డ్ కంటెంట్ ను ప్రేక్షకులకు నచ్చేలా కనెక్ట్ చేయడం అనేది సాహసంతో కూడిన పని. కానీ అజయ్ భూపతి ఆ సబ్జెక్టును కరెక్టుగా హ్యాండిల్ చేసి.. హిట్ కొట్టాడు. అంతే కాదు.. టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

Do you know who is the heroine who missed the role of Payal Rajput in the Mangalavaaram movie?

ఇక ఆ సినిమా తర్వాత మల్టీ స్టారర్ గా మహా సముద్రం తెరెక్కించాడు. శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుని మంగళవారం అనే సినిమాతో ప్రేక్షుకలు ముందుకు వచ్చాడు. ఇక ఈ పేరు వినగానే ఇదేం సినిమా అనిపించింది. ఇక తనకు లక్కీ హీరోయిన్ గా కలిసి వచ్చిన భామ పాయల్ రాజ్ పుత్ ను ప్రధాన పాత్రలో పెట్టి ఈ సినిమాను తెరకెక్కించాడు అజయ్.

Do you know who is the heroine who missed the role of Payal Rajput in the Mangalavaaram movie?

ఇక ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోసారి బోల్డ్ కంటెంట్ తో అజయ్ భూపతి, పాయల్ రాజ్ పుత్ రాబోతున్నట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థం అయింది. దానికి తోడు అల్లు అర్జున్, చిరంజీవి ఈ సినిమాకు సపోర్టుగా నిలిచారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ సందడి చేసిన విషయం తెలిసిందే. ఆయన ఈ ట్రైలర్ చూసి షాక్ అయినట్లు చెప్పుకువచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి టాక్ తో దూసుకుపోతుంది.

అయితే ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను అనుకోలేదట. మహా సముద్రం తెరకెక్కించే సమయంలోనే ఈ సినిమా కథను రాసుకున్నాడట అజయ్. అలా అప్పుడు ఈ స్టోరీని మహా సముద్రం హీరోయిన్ అతిథి రావు హైదరికి చెప్పాడ. దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని తెలుస్తోంది. అయితే మళ్లీ ఆమెను సంప్రదించలేదని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు పాయల్ అయితే కరెక్ట్ అని భావించారట అజయ్. అలా అతిథి నుంచి పాయల్ రాజ్ పుత్ కు చేరింది ఈ స్టోరీ.

Do you know who is the heroine who missed the role of Payal Rajput in the Mangalavaaram movie?

మొత్తానికి ఈ సినిమా పాయల్ రాజ్ పుత్ యాక్టింగ్ తో మరో లెవెల్ కి వెళ్లింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే... మంగళవారం సినిమాను అజయ్ భూపతి ఎం. సురేష్ వర్మ, స్వాతి రెడ్డితో కలిసి నిర్మించారు. సినిమాలో పాయల్ రాజ్ పుత్ తో పాటు అజ్మల్ అమీర్ కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా పాజిటివ్ టాక్ తో థియేటర్ వద్ద దూసుకుపోతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో లేదో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X