'దూకుడు' బాక్స్ లు వెనక్కి వస్తున్నాయంటూ...
దూకుడు చిత్రం రేపు(శుక్రవారం)భారీ ఎత్తున విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో దూకుడు భాక్స్ లను అన్ని చోట్లుకు పంపుతున్నారు. అయితే పంమపిన భాక్స్ లతో సమస్య వచ్చి వెనక్కి వచ్చాయని మీడియా సర్కిల్స్ లో వార్త స్ప్రెడ్ అవుతోంది. అందుకు కారణంగా..పంపిన భాక్స్ లలో ఉన్న ప్రింట్స్ లలో రీ రికార్డింగ్ సమస్య వచ్చిందని, సీన్ కీ, రీ రికార్డింగ్ కీ లింక్ లేకుండా పోయిందని, అలాగే కొన్ని చోట్ల లిప్ మూవ్ మెంట్, వాయిస్ కూడా సింక్ అవలేదని కంగారులో చేసిన రీరికార్డింగ్ తో దొర్లిన టెక్నికల్ ప్లాబ్లం అని చెప్పుకుంటున్నారు. దాంతో కంప్లైంట్ ఉన్న భాక్స్ లు అన్నిటిని చెక్ చేసి వెనక్కి పంపితే తిరిగి మంచి వాటని పంపుతున్నట్లు వినపడుతోంది. అయితే అది రూమరా నిజమా అనేది తేలటం లేదు. దీనిపై క్లారిఫికేషన్ ఇవ్వటానకి దూకుడు టీమ్ మీడియాకు అందుబాటులో లేదు. వారంతా ప్రింట్స్ పంపే బిజీలో ఉన్నారు. దూకుడు సినిమా పోకిరి లాగానో, ఒక్కడు లాగానో ఉండాలని డిజైన్ చెయ్యలేదు. మంచి ఎమోషన్, కామిడీ ని కలిపి బ్లెండ్ చేస్తూ చెప్పిన ఒక కొడుకు కథ అంటున్నారు రచయిత గోపీ మోహన్.
ఆయన ఈ చిత్రం గురించి తన ట్విట్టర్ ఎక్కౌంట్ లో ఇలా ట్వీట్ చేసారు. అలాగే బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు అంటున్నారు రైటర్ గోపీమోహన్. అలాగే ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు. సెన్సార్ U/A సర్టిఫికేట్ తో క్లియరెన్స్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











