హాట్ స్టార్ సమంతను ...మహేష్ బాబు చెల్లెలు అంటున్నారు
అదేంటి మహేష్ దూకుడు సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న సమంత ని అలా మహేష్ చెల్లెలు అనటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా. అది సమంత తెలుగు పరిశ్రమలో సాధించుకున్న బిరుదు. మహేష్ లా చాలా స్లోగా కెరీర్ ని తీసుకెళ్తోందని, ఒక్కో సినిమా ఒప్పుకునేందుకు ఆమె చాలా టైం గ్యాప్ తీసుకుంటోందని, అంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమాలు ఏమీ అద్బుతంగా ఉండవని అలా ఆమెకు నిక్ నేమ్ పెట్టారు. 'బృందావనం" షూటింగ్ అయిపోయాక దాదాపు చాలారోజులు గాప్ తీసుకుని ఇప్పుడు 'దూకుడు" చిత్రంలో నటిస్తోంది సమంత. అలాగే ఆ తర్వాత రాజమౌళి చిత్రం తప్ప మరేమి ఆమె ఒప్పుకోలేదు. కథ బాగోలేదని, హీరో నచ్చలేదని, ప్రొడక్షన్ మంచిది కాదని ఇలా రకరకాల కారణాలు చెప్తోంది. ఆమెను మీడియా ఇంత గ్యాప్ తీసుకోవడానికి కారణమేమిటని అడిగితే మంచి చిత్రం దొరకలేదని చెబుతోంది. కథాబలం ఉండి నటించడానికి అవకాశమున్న పాత్రలైతేనే చేస్తానని చెబుతోంది. ప్రస్తుతం ఆమె 'దూకుడు" చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











