మహేష్ 'దూకుడు' ఆ జర్మనీ సినిమా కాపీ
మహేష్ తాజా చిత్రం దూకుడు గుడ్ బై లెనిన్ అనే జర్మనీ చిత్రం నుంచి ప్రేరణ పొందినట్లు సమాచారం. 2003లో వచ్చిన ఈ ట్రాజీ కామెడీ సినిమా ఓ కొడుకు తల్లి కోసం ఆడే నాటకం చుట్టూ తిరుగుతుంది. కోమాలోకి వెళ్ళి వచ్చిన ఆమె కోసం కోమాలోకి వెళ్ళేముందు రాజకీయ పరిస్ధితులను సృష్టించటం, అప్పటి వాతావరణం క్రియేట్ చేయటం జరుగుతుంది. అలాగే దూకుడు లో హీరో తన తండ్రి ప్రకాష్ రాజ్ కోమాలోకి వెళ్ళి పధ్నాలుగు సంవత్సరాల తర్వాత వస్తే అతని కోసం ఆయనకి ఇష్టమైన సీనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడని, తాను ఎమ్మల్యేనని నాటకం ఆడటం మొదలెడతాడు. అలాగే ఈ చిత్రం కూడ పూర్తి కామిడీగా జరుగుతుంది.
ఇక దూకుడులో మహేష్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. ఇక వినాయికుడు పేమ్ సోనియా ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. అలాగే రక్త చరిత్ర ఫేమ్ అభిమన్యు సింగ్ విలన్ గా కనపించి అలరిస్తాడు. బ్రహ్మానందం సినిమా చివరి దాకా ఉండి నవ్వులు పండిస్తాడు. అలాగే ఈ చిత్రంలో డైలాగులుకు ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి రాసారు. మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతా, భయానికి మీనింగే తెలియని బ్లడ్ రా నాది వంటి డైలాగులు అభిమానులు చేత టప్పట్లు కొట్టిస్తాయంటున్నారు. ఎప్పట్లాగే మాస్టర్ భరత్ ఈ చిత్రంలో ఓ విచిత్రమైన పాత్రలో కనిపించి నవ్వించనున్నారు.


Click it and Unblock the Notifications











