'దూకుడు' లో ఇంటర్వెల్ ఫైట్ కూడా కాపీనే!?
మహేష్ బాబు తాజా చిత్రం దూకుడు కలెక్షన్స్ లో తనకు ఎదురేలేదంటూ డేరింగ్ అండ్ డాషింగ్ గా దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం లో పలు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి.ఇందులోని మెయిన్ కాన్సెప్టు గుడ్ బై లెనిన్ అనే జర్మనీ చిత్రం నుంచి లిప్ట్ చేసారన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచిన ఇంటర్వెల్ బ్యాగ్ 'Legend of the Fist: The Return of Chen Zhen'అనే హాంకాంగ్ చిత్రం నుంచి లిప్ట్ చేసారంటూ అంతటా వినిపిస్తోంది. ఫేస్ బుక్ ఎక్కడ చూసినా ఈ వీడియోనే దర్శనమిస్తోంది. ఆ లింక్ ఇదే
మొదటివారంలోనే ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మంచి లాభాలు పొందాలన్న నిర్మాతలు వ్యూహం సక్సెస్ అయినట్లైంది. మరో ప్రక్క చెన్నై లో ఈ సినిమా 15 థియేటర్లలో రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ ఇచ్చింది.దీనికి తోడు దూకుడు ఇప్పుడు బెంగుళూరు నగరంలో సరికొత్త రికార్డుల మోతతో విజయవంతంగా నడుస్తోంది. ఈ సినిమా విదేశాల్లో 'దబాంగ్" రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. తొలి మూడు రోజుల్లో రూ. 21.22 కోట్ల షేర్‌ని వసూలు చేసి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుని సాధించింది . 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాతలు చెప్తున్నారు. అమెరికాలో మూడు రోజుల్లో 15 లక్షల డాలర్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైంది.


Click it and Unblock the Notifications











