మగధీర పై ఘాటుగా సెటైర్ విసిరిన విజయనిర్మల...!?
దూకుడు సినిమాతో భారీ విజయాన్ని సాధించిన మహేష్ బాబు ఓ కామెడీ చిత్రంతో ఇంతటి రికార్డులు సాధించడం పట్ల అభిమానులు ఉప్పొంగిపోతున్నారు. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా కేవలం మహేష్ గ్లామర్ తో ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో ద్వితీయ స్థానం ఆక్రమించుకోవడంతో ఇది మహేష్ సమ్మోహన శక్తిని తెలియజేస్తోందని అంటున్నారు.
మగధీర సినిమాకి కనీ వినీ ఎరుగని సెట్టింగ్స్, గ్రాఫిక్స్ తో రాజమౌళి కట్టి పారేస్తే ఆ చిత్రం ఎవరూ చేరుకోలేని రికార్డులని నెలకొల్పింది. దాంతో అలాంటి సినిమా మహేష్ చేస్తే మగధీర రికార్డులు అవలీలగా అధిగమిస్తారని మహేష్ అభిమానులు నమ్మకం. వారి మనస్సులో మాటని విజయనిర్మల దూకుడు యాభై రోజుల వేడుకలో బయటపెట్టారు. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, మాయలు, మంత్రాలు లేవని, కేవలం మహేష్ గ్లామర్ తోనే ఇంత పెద్ద హిట్ అయిందని ఆమె పేర్కొన్నారు. అది ఇన్ డైరెక్టుగా మగధీర ఉద్దేశించి చేసిన కామెంట్ అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదని మెగా ఫ్యాన్స్ బాధపడుతున్నారు.


Click it and Unblock the Notifications











