దూకుడు రికార్డ్ విషయంలో తప్పంతా వారిదే: రాజమౌళి
తెలుగు చలన చిత్ర సీమలో ప్రస్తుతం స్టార్ వార్ కొనసాగుతోంది. తెలుగు చలన చిత్ర సీమలో 101 కోట్ల రికార్డు వసూళ్లు చేసిందని ప్రిన్స్ మహేష్ బాబు 'దూకుడు" చిత్రం నిర్మాతలు వెల్లడించడంతో దానికి ఖండనగా శనివారం రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి పేరుతో పలు పత్రికల్లో వెలువడిన ప్రకటన చిత్రసీమలోని స్టార్ వార్ ను బట్టబయలు చేసింది. రామ్ చరణ్ తేజ 'మగధీర" చిత్రం ఇప్పటివరకు తెలుగు చిత్ర సీమలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా పేరు తెచ్చుకుంది. తాజాగా దానిని మహేష్ 'దూకుడు" అధిగమించిందని వార్తలు వచ్చాయి.
ప్రతి చిన్న విషయానికి ఎక్సైట్ అవ్వడం మహేష్ బాబుకు అలవాటు. అభిమానులు కోరుకునేది కూడా అదే. తన సినిమాల వరకు మాత్రమే అయితే బాగుండేది. కానీ ఇట్ ఈజ్ అఫిషియల్. మగధీరను దూకుడు కొట్టేసింది" అని వేసిన మహేష్ బాబు ట్వీట్ చేయడం, నిర్మాత అనిల్ సుంకర దూకుడు యాభై రోజుల ఫంక్షన్ లో ఇట్ ఈజ్ అఫిషియల్. దూకుడు మగధీరను కొట్టేసింది అని చెప్పడంతో అవి రెండు వర్గాల అభిమానుల మధ్య పెద్ద దుమారాన్నే రేపింది. అది ఎంత వరకు వెళ్లిందంటే, అల్లు శిరీష్ మాస్ పంచ్ డైలాగ్స్ వేయడం, రామ్ చరణ్ కూడా స్పందించ వలసిన రేంజ్ కు వెళ్ళింది. రికార్డుల పిచ్చి తెరమరగువుతున్న సమయంలో, మళ్ళీ మీడియా సహకారంతో అభిమానులను రెచ్చగొడుతున్నత పనియైంది.
కాగా దీనిపై ఓ అభిమాని ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ..ఇప్పుడు తప్పంతా అభిమానులదే అంటూ దర్శకుడు రాజమౌళి అంటున్నారు. అది చూసిన కొంతమంది ట్విట్టర్ అభిమానులు రికార్డులంటూ అభిమానులను రెచ్చ గొట్టిన హీరోలను నిర్మాతలను వదిలేసి తప్పంతా అభిమానులదే అన్నట్టు నెట్టేయడం ఏం బాగోలేదు అంటున్నారు. బహుశా వాళ్లకు(మహేష్ బాబు ఇట్స్ అఫిషియల్ అని తన ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేసిన మొదట వ్యక్తి, తర్వాత దూకుడు నిర్మాత అనిల్ సుంకర) తర్వాత రెస్సాండ్ అయిన అల్లు శిరీష్, చరణ్ అని చెప్పలేక ఇలా అభిమానులనుపై నెట్టేయడం ఏమి బాగోలేదంటున్నారు.


Click it and Unblock the Notifications











