మహేష్ నిర్మాతతో పవన్ నెక్ట్స్ ఖరారు
మహేష్ బాబుతో దూకుడు చిత్రం చేస్తున్న అనీల్ సుంకర తన తదుపరి చిత్రాన్ని పవన్ కళ్యాణ్ తో చేయాలని నిర్ణయించుకున్నారు. తమ బ్యానర్ ద్వారా బిందాస్ చిత్రంతో పరిచయమైన వీరూపోట్ల దర్సకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. వీరూపోట్ల రగడ చిత్రం చూసి మాస్ హీరోగా బాగా ఎలివేట్ చేయటం నచ్చిన పవన్ వెంటనే ఈ ప్రాజెక్టు ఓకే చేసారు. ఇక ఎలాగయినా పవన్ తో హిట్ కొట్టాలనే ఉద్దేశంతో పూర్తి స్ధాయి స్క్రిప్టుకి వీరూ పోట్ల కసరత్తులు చేస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్... సంఘమిత్ర ఆర్ట్స్, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సారాజేన్ డైస్, అంజని లావని కథానాయికలుగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తమిళంలో భిళ్లా చిత్రం రూపొందించిన విష్ణువర్థన్ దర్శకుడు. కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడే చాలా భాగం షూటింగ్ చేసారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. ఈ చిత్రంలో పవన్ పాత్ర చిత్రణ, వేషధారణ కొత్త పంథాలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు 2న పవన్ జన్మదినం సందర్భంగా టైటిల్ ప్రకటిస్తారు. ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్, కూర్పు: శ్రీకర్‌ప్రసాద్, సంగీతం: యువన్ శంకర్‌రాజా.


Click it and Unblock the Notifications











