'ఖలేజా' లాగానే మహేష్ ‘దూకుడు’ సినిమాను కూడా...?
మహేష్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న 'దూకుడు" చిత్రం ఆగస్టు 12న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రం వాయిదా పడేటట్లు కనపుడుతోంది.సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కానీ ఈ సినిమాని విడుదల చేసే అవకాసం లేదని తెలుస్తోంది. విడుదల వాయిదాకు కారణం పరిశ్రమలో ఆ మధ్య చోటుచేసుకున్న సమ్మెకారణమని చెప్తున్నారు.ఇప్పటివరకూ కేవలం ఫిప్టీ పర్శంట్ మాత్రమే షూటింగ్ పూర్తయినట్లు వినికిడి.ఇక మహేష్ సినిమాను ప్రక్కన పెట్టి యాడ్స్ లో బిజీ అవ్వటం అస్సలు కారణమని గుసగుసలు వినపడుతున్నాయి.
ఇక 'ఖలేజా" చిత్రం తర్వాత మహేష్ బాబు నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సమంతా హీరోయిన్ గా నటిస్తోంది. హ్యాపిడేస్ సోనియా'దూకుడు" చిత్రంలో ఓ ప్రముఖ పాత్రను పోషిస్తోంది. 16 రీల్స్ బ్యానర్ పై రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్..పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ఈ చిత్రానికి 'కిక్", 'బృందావనం" ఫేం తమన్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











