'దూకుడు'లో ఎమ్.ఎస్ పాత్ర ఆ హీరోపై సెటైర్
శ్రీను వైట్ల గత చిత్రాలు దుబాయి శ్రీనులో సాల్మన్ రాజు, రెడీలో దానయ్య, కింగ్ లో జయసూర్య పాత్రలను క్రియేట్ చెయ్యటం ద్వారా కొంత కాంట్రావర్శికి గురి అయిన సంగతి తెలిసిందే. ఆయన తాజా చిత్రం దూకుడులోనూ ఎమ్ ఎస్ నారాయణ పాత్ర ఇప్పుడు తెలుగులో ఓ స్టార్ హీరోను సెటైర్ చేస్తూ రూపొందిందంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. వయస్సు మీదపడుతున్నా దానిని దాచే ప్రయత్నం చేస్తున్న వెంకటేష్ ని ఈ పాత్ర ద్వారా శ్రీను వైట్ల తూర్పారబెట్టాడని అంటున్నారు. అలాగే ఆ పాత్రకు వెంకట్రావు అనే పేరును కూడా పెట్టారు. వెంకటేష్ తో నమో వెంకటేశ చిత్రం శ్రీను వైట్ల గత చిత్రం. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద విజయవంతం కాలేదు. ఇక ఎమ్ ఎస్ పాత్రకు వెరైటి విగ్గు పెట్టి, జెనిలియా లాంటి హీరోయిన్ ని అడగటం ద్వారా వెటకారం చేసాడని చెప్పుకుంటున్నారు. అలాగే ఎమ్ ఎస్ పాత్ర ఎప్పుడూ యంగ్ లా కనపడాలని టీ షర్ట్ లు వాడుతూం ఇటుంది. వయస్సుని దాచే విచిత్రమైన మ్యాకప్ ని వేసుకుంటూంటుంది. ఇవన్ని గమనించిన వారు ఈ టాపిక్ పై మాట్లాడుకుంటున్నారు. ఇక దూకుడు చిత్రం కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది.
మొదటివారంలోనే ఈ సినిమాను సాధ్యమైనన్ని ఎక్కువ థియేటర్లలో విడుదల చేసి మంచి లాభాలు పొందాలన్న నిర్మాతలు వ్యూహం సక్సెస్ అయినట్లైంది. మరో ప్రక్క చెన్నైలో ఈ సినిమా 15 థియేటర్లలో రిలీజ్ అయి భారీ ఓపెనింగ్స్ ఇచ్చింది. దీనికి తోడు దూకుడు ఇప్పుడు బెంగుళూరు నగరంలో సరికొత్త రికార్డుల మోతతో విజయవంతంగా నడుస్తోంది. ఈ సినిమా విదేశాల్లో 'దబాంగ్" రికార్డును అధిగమించింది. ఒక్క అమెరికాలోనే 2రోజుల్లో 15లక్షల డాలర్లను వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఓ తెలుగు సినిమా ఈ స్థాయి వసూళ్లను సాధించడం ఇదే తొలిసారి. తొలి మూడు రోజుల్లో రూ. 21.22 కోట్ల షేర్‌ని వసూలు చేసి 80 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుని సాధించింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లిమిటెడ్ పతాకంపై నిర్మాణమైన ఈ చిత్రం విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఆల్ టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్నందుకు సంతోషంగా ఉందని నిర్మాతలు చెప్తున్నారు. అమెరికాలో మూడు రోజుల్లో 15 లక్షల డాలర్లు వసూలు చేయడం మామూలు విషయం కాదు. 1600పైగా థియేటర్లలో సినిమా రిలీజైంది.


Click it and Unblock the Notifications











